ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న గండ్ర దంపతులు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్
భూపాలపల్లి టౌన్ అక్టోబర్ 17 (జనం సాక్షి)
పేదలకు, యువతి యువకులకు, నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి తన తండ్రి పేరు మీద జి ఎం ఆర్ ఎం ట్రస్టును ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏర్పాటుచేసి గండ్ర దంపతులు నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నియోజకవర్గంలోని 1000 మంది నిరుద్యోగులకు ఉచితంగా పి ఈ టి గ్రూప్స్ కోచింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు ట్రస్టు ఆధ్వర్యంలో 500 మందికి ఉచిత డ్రైవింగ్ శిక్షణను ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి కల్లెపు శోభ రఘుపతి రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ బుర్ర రమేష్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు హింగే మహేందర్, ఎంపీపీ శ్రీమతి మందల లావణ్య సాగర్ రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు