ట్రాక్టర్‌పై గ్రామాలను చుట్టిన పోచారం


ప్రజాసమస్యలపై నేరుగా ఆరా
నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌పై గ్రామాలకు వెళ్లి.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలో మంగళవారం ఉదయం గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను వెంటబెట్టుకొని స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ టాక్లి, సోంపూరు గ్రామాలను కలియదిరిగారు. ఈ సందర్భంగా జనం ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు.. అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ప్రభుత్వ అధికారులతో నేరుగా ప్రజల చెంతకు స్పీకర్‌ రావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పలువురు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. రైతులకు సంంధించి పథకాలపై ఆరా తీసారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.