ట్రాఫిక్ ఎస్సై సిరిసిల్ల అశోక్‌కు రాఖీ కడుతున్న బాలికలు
-బస్సు కండక్టర్లు, డ్రైవర్లకు రాఖీలు కడుతున్న బాలికలు
బాలల హక్కుల పరిరక్షణ వారోత్సావాలు
మహబూబాబాద్, నవంబర్ 18(జనంసాక్షి):
బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలో చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో బాలలతో నేస్తం అనే అంశంపై బస్టాండ్ సెంటర్, మధర్ ధెరిస్సా విగ్రహం వద్ద చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ట్రాఫిక్ ఎస్సై సిరిసిల్ల అశోక్‌కు విద్యార్థినులు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తప్పిపోయిన, ఇంటి నుండి పారిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు 1098 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. బాలలను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని, వారి హక్కుల పరిరక్షణ ఎంతో అవసరమని, అందుకు పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం ఎస్సీ బాలాకల విద్యార్దినులచే ట్రాఫిక్ పోలీసులు, ఆర్టిసీ డ్రైవర్లు, కండక్టర్లకు, ఆటో డ్రైవర్లకు రాఖీలు కట్టించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ జిల్లా కో-అర్డినేటర్ తప్పెట్ల వెంకటేష్, సిబ్బంది అరుణ, ఉమారాణి, వెంకట్‌గౌడ్, అనిల్ పాల్గొన్నారు.