ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి

ట్రాఫిక్ నిబంధనలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
అతివేగం ప్రాణ నష్టం సెల్ న్ డ్రైవింగ్ ను నిర్మూలించండి
జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి హనుమంతరావు ,డి.ఎస్.పి రవీందర్ రెడ్డి
న్యాయ సేవ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఫై అవగాహన ర్యాలీ
జనం సాక్షి సంగారెడ్డి రూరల్
టాపిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడిపించాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి హనుమంతరావు సంగారెడ్డి డి.ఎస్.పి రవీందర్ రెడ్డి అన్నారు శనివారం జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ కోర్టు ప్రాంగణం నుండి ఐబి వరకు ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి హనుమంతరావు డిఎస్పి రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు  జాగ్రత్తలు తీసుకోవాలని మద్యం సేవించి ,    వాహనాలు నడుపుతే ప్రమాదాలకు కారణమవుతారని అన్నారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని అన్నారు వాహనాలు నడపడంలో నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణాలకే  ప్రమాదం అని అన్నారు మద్యం సేవించి , ఫోన్ మాట్లాడుతూ వాహనాలు  నడిపితే కఠిన చర్యలు తప్పవని అన్నారు కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలు డ్రైవింగ్ చేయాలని అతివేగంగా వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని అన్నారు ముఖ్యంగా యువకులు యవ్వన వయసులో అతివేగంగా వెళ్లి  రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు వారి తల్లిదండ్రులు వారి మీద పెట్టుకున్న ఆశలు నిరాశలుగా మిగిలిస్తున్నారు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మోటార్ సైకిల్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, ఆటో రిక్షా , ఆర్టీసీ డ్రైవర్లు , వివిధ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్, ట్రాఫిక్ సిఐ రాజు,  బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్టిఏ అధికారి శ్రీనివాస్,  విజయేందర్ రెడ్డి,  కూన వేణుగోపాల్, మల్లేశం, , లైన్స్ క్లబ్ నాయకులు పోలీస్ సిబ్బంది కోర్టు సిబ్బంది వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు