ట్రాయ్ కాగ్ అధ్వర్యంలో

టెలికాం వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు – కల్లెపు శోభారాణి జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్ 8: జనగాం పట్టణలో ఎ. బి.వి. కాలేజ్ కాన్ఫరెన్స్ హల్ నందు టెలికాం వినియోగదారులకు, ప్రజలకు, విద్యార్థులకు టెలికాం సంబంధిత వినియోగల పైన అవగాహాన సదస్సు నిర్వహించడం జరిగింది..
తెలంగాణ రాష్ట్ర టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా ట్రైయ్ కాగ్ సభ్యురాలు కల్లెపు శోభారాణి మాట్లాడుతూ ప్రపంచంలోనే మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మొబైల్ వినియోగదరులు టెలికాం సంస్థల నుండి ఉత్తమ సేవలు పొందెల ఈ తరహా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పత్రాన్ని 2006 లో తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు 48 కోట్ల మంది వినియోగదారులు వినియోగించుకున్నారు. అలాంటి కాల్ మొబైల్ వినియోగారులకు ప్రధాన సమస్యగా మారడాన్ని ట్రాయ్ గుర్తించి 1909 నెంబర్ కు కాల్ చేసి ఆలాంటి వారిపై పిర్యాదు చేస్తే ఆ నెంబర్ బ్లాక్ బ్లాక్ చేస్తాము. 2025 నాటికి అందరూ బ్రాడ్ బ్రాండ్ కలిగి ఉండేలా దేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాము టెలి మార్కెటింగ్ కాల్స్ ను అడ్డుకోవడానికి డు నాట్ డు డి.ఎన్. డి అనే యాప్ నీ డౌన్ లోడ్ చేసి అందులో తమ నెంబర్ నీ నమోదు చేసుకుంటే అనవసర వ్యాపార సంస్థ ల కాల్స్ రావు ప్రతి ఒక్కరు టెలికాం రంగంలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ టెలికాం సంస్థల ప్రతనిధులు, ఎన్.జి.ఓ ప్రముఖులు,ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.