ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన లారీ తప్పిన పెను ప్రమాదం…
శంకరపట్నం జనం సాక్షి నవంబర్ 12
శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో నల్ల వెంకయ్య పల్లె క్రాస్ జాతీయ రహదారి పైన శనివారం ఓ లారీ ట్రాలీ ఆటోను వెనుక నుండి ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు అరికె టి శ్రీనివాస్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పట్టణం కోతి రాంపూర్ కు చెందిన అరికెటి శ్రీనివాస్ తన సొంత ట్రాలీ ఆటోను హుజురాబాద్ కు సామాను దిగుమతి కోసం వెళ్లి తిరిగి కరీంనగర్ కు వస్తుండగా కేశపట్నం శివారు నల్ల వెంకయ్య పల్లె క్రాస్ రోడ్డు స్పీడ్ బ్రేకర్ల వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో సమీపములోని విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎగిరి పడిందని ఈ ఘటనలో శ్రీనివాస్ కు స్వల్ప గాయాలు కాగా పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులు ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్తు శాఖ ఉద్యోగులు పేర్కొన్నారు. ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన లారీని కేశవపట్నం గ్రామానికి చెందిన వాటర్ ప్లాంట్ యజమాని శ్రావణ్ కుమార్ వెంబడించి లారీని నిలిపివేసి లారీ డ్రైవర్ను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.