ట్రిపోలిలో ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్ల దాడి
హైదరాబాద్, జనవరి27(జనంసాక్షి): ఉత్తరాఫ్రికాలోని లిబియా దేశ రాజధాని ట్రిపోలిలో మంగళవారం ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా)కు చెందిన ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రాజధాని నగరంలో విదేశీ అతిధులు ఎక్కువగా బస చేసే కొరింతియా ¬టల్‌పై ఈ దాడి జరిగింది. ¬టల్‌పై దాడి చేసే ముందు ఉగ్రవాదులు బాంబులతో నింపిన కారును పేల్చివేసి ఒక్కసారిగా ¬టల్‌లోకి ప్రవేశించి ముగ్గురు ¬టల్ గార్డులను కాల్చిచంపారు. ¬టల్‌లోకి చొరబడి కొందర్ని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఐదుగురిని చంపివేసినట్టు తెలిసింది. కాగా తామే ఈ దాడికి పాల్పడినట్టు ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదసంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే దీనిపై లిబియా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మాస్క్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ కోట్లు ధరించి…
దుండగులు ముఖానికి మాస్క్‌లు, బుల్లెట్ ప్రూఫ్ కోట్లు ధరించి, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు ¬టల్ సిబ్బంది ఒకరు పేర్కొన్నారు. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది ఈ దాడిలో వుండవచ్చని లిబియా భద్రతాదళాలు పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న లిబియా ప్రత్యేకదళాలు ¬టల్‌ను చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ¬టల్‌లో ఎక్కువమంది అతిథౖలు లేరని తెలిసింది. ట్రిపోలిపై ఉగ్రవాదులు దాడి చేశారన్న సమాచారంతో లిబియా అంతటా రెడ్‌అలర్ట్ ప్రకటించారు. ట్రిపోలితో పాటుమరో ముఖ్యనగరమైన బెంఘాజీలో భద్రతను పెంచారు.
గ్యారేజీ నుంచి తప్పించుకున్నాం
బాంబుపేలుళ్లతో ¬టల్‌గదుల్లో వున్న అనేకమంది ఒక్కసారిగా భయంతో బయటకు వచ్చినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కొందరు ¬టల్ సెల్లార్‌లో ఉన్న గ్యారేజీలోనుంచి తప్పించుకున్నట్టు పేర్కొన్నారు.
లిబియాలో వర్గ పోరు
లిబియాలో 2011లో అప్పటి అధ్యక్షుడు గడ్డాఫీ పదవీచ్యుతి అనంతరం దేశం రెండుగా చీలిపోయింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. రెండు ప్రాంతాలకు చెందిన సాయుధులు పరస్పరం దాడులు చేసుకోవడంతో లిబియాలో అంతర్గత పోరు నెలకొంది. సమస్య పరిష్కారానికి ఐరాస తీసుకుంటున్న చర్యలు కూడా ఫలించడం లేదు. ఇదే అదనుగా అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలు తమ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు యత్నించడం గమనార్హం.
వరుస ఉగ్రదాడులతో భయం భయం..
ఉగ్రవాద దాడులు వరుసగా జరుగుతుండటం ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. ఆస్గేలియా సిడ్నీ నగరంలో ఒక కేఫ్‌లో దుండగుడు కొందర్ని బందీలుగా పట్టుకోవడం, ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో చార్లిహెబ్డొ కార్యాలయంపై ఇద్దరు ఉగ్రవాదుల దాడిలో 12 మంది మరణం, పారిస్‌లోని సూపర్‌బజార్‌లో ఉగ్రవాది దాడి, తాజాగా లిబియాలో ¬టల్‌పై దాడి … తదితర వరుస ఉగ్రవాద దుశ్చర్యలతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఐరోపా, అమెరికా, ఆసియా… తదితర ఖండాల్లోని దేశాల్లో పటిష్టమైన భద్రతాచర్యలను చేపట్టారు.