డంపింగ్ యార్డును నివాస ప్రాంతాల నుండి తరలించాలి సిపిఎం డిమాండ్
నాగారం ప్రాంతంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డ్ మూలంగా ఆ ప్రాంతంలోని ప్రజలు రోగాలకు గురవుతున్నారని వెంటనే దాన్ని అక్కడి నుండి మార్చాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజల దీక్ష శిబిరానికి ఆదివారం సిపిఎం జిల్లా కమిటీ హాజరై వారికి సంఘీభావాన్ని ప్రకటించటం జరిగింది అనంతరం వారినుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మున్సిపల్ అధికార యంత్రాంగం నివాసాలకు దగ్గర ఏర్పాటు చేయటం సరైంది కాదని దాని మూలంగా అనేకమంది పిల్లలు పెద్దలు శ్వాసకోశ వ్యాధులు ఇతర అనారోగ్యాలకు గురై ప్రాణాల మీదికి తెచ్చుకోవటం జరుగుతుందని అన్నారు. గతంలో చిత్త శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను శుద్ధి చేసి తరలిస్తామని, అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, హామీ ఇచ్చి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి చెత్తను శుద్ధి చేయకుండా విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల చెత్తను ఇతర కళేబరాలను నివాస ప్రాంతాల మధ్యలో వేయటం వల్ల చెత్త కు నిప్పు పెట్టడం వల్ల దుర్వాసనతో ప్రాంతమంతా దుర్గంధం గా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడినుండి చెత్త డంపింగ్ యార్డును మార్చాలని ప్రజల కోరికను మన్నించి వైద్యులతో ప్రజల ఆరోగ్యాలను పరీక్షించాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలు చేసే పోరాటానికి తమ పార్టీ సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు .అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్ రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి సూరి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.