డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆక్రమణ కార్యక్రమం ఉద్రిక్తత.
సిపిఎం కార్యకర్తలు అరెస్ట్.
అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం ఎమ్మెల్యే అసమర్థత.
మళ్లీ పేదలతో కలిసి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమిస్తాం.
సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆద్వర్యంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆక్రమణ కార్యక్రమం ఉద్రిక్తతకు చోటుచేసుకున్నది.శనివారం సిపిఎం నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వరకు ర్యాలీ గా వెళ్లి వాటిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అప్పటికే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ
అక్రమ అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అసమర్థతనే నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాలేదని అన్నారు.గత నాలుగు సంవత్సరా లుగా పేదలు అధికారులకు విన్నవించారని వినతి పత్రాలు సమర్పించారని అయినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం వాటి నిర్మాణం కోసం చొరవ చూపకపోవడం దుర్మార్గమని అన్నారు.కాంట్రాక్టర్లు కూడా తమ సమస్య ల్ని ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టి పట్టనట్టు గా వ్యవహరిస్తున్నారని అన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన తరువాత ప్రారంభమైన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గానీ టిఆర్ఎస్ భవనం కానీ త్వరగా పూర్తయిం దని కానీ పేదలు నివసించాల్సిన గృహాలను మాత్రం పట్టించుకోకపోవడం అంటే పేద ప్రజల పట్ల స్థానిక ఎమ్మెల్యే కున్న గౌరవం అర్థమవుతున్నదని అన్నారు. కేవలం 192 ఇండ్లను మాత్రమే తూతూ మంత్రంగా నిర్మిస్తున్నాడని పట్టణంలో వేలాదిమంది పేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు.ప్రభుత్వం రద్దు చేసిన ఇండ్ల స్థలాల పంపిణీ జీఓ ను వెంటనే పునః ప్రారంభించాలని ప్రతి పేదవాడికి 120 గజాల ఇండ్ల స్థలాన్ని ఇచ్చి పది లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, కే గీత, బి.ఆంజనేయులు,మండల కార్యదర్శి అశోక్,మాజీ ఎంపిటిసి యాదయ్య, ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాస్, బాల్ రెడ్డి, శివ వర్మ, తారా సింగ్, రామయ్య, శివకుమార్, సత్యనారాయణ, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.