డబుల్స్ లో సానియా జోడీ ఓటమి
రియో ఒలింపిక్స్ లో సానియా మీర్జా జోడి నిరాశపర్చింది. విమెన్స్ డబుల్స్ కేటగిరీలో బరిలోకి దిగిన సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి తొలి రౌండ్ లోనే ఫెల్యూర్ ఆటను ప్రదర్శించారు. ఆదివారం తెల్లవారజామున జరిగిన మ్యాచ్ లో సానియా జోడి 6-7, 5-7, 7-5 తేడాతో చైనా జంట షాయి జంగ్, షాయి పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి సెట్ లో పోరాడిన సానియా జంట, రెండు, మూడు సెట్లలో పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించలేక పోయింది. దీంతో సానియా ద్వయం ఫస్ట్ రౌండ్ లోనే ఓటమి పాలైంది.
ఇక టెన్నిస్ లో భారత ఆశలు మిక్స్ డ్ డబుల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. మిక్స్ డ్ డబుల్స్ లో సానియా-రోహన్ బోపన్నలు జంటగా ఆడనున్నారు.
అంతకుముందు పురుషుల డబుల్స్ పోరులో లియాండర్ పేస్-బోపన్నల జోడి కూడా తొలి రౌండ్ లో ఓటమిపాలయ్యింది.