డబుల్ ఇంజన్ సర్కార్కు అవకాశం ఇస్తే టీఆర్ఎస్ మంత్రుల అవినీతి మొత్తం కక్కిస్తాం..
– బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి
వనపర్తి బ్యూరో, సెప్టెంబర్ 19, జనంసాక్షి : వనపర్తి నియోజకవర్గం లోని శ్రీరంగాపూర్ మండలం కంబాల పురం గ్రామంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా గోస బిజెపి భరోసా బైక్ యాత్రను బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బిజెపి జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథి గా ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 24,800 గ్రామాలలో ప్రజాగోస బిజెపి భరోసా పేరుతో బైక్ యాత్ర జరుగుతుందని రాష్ట్రంలో ఏ గ్రామానికి, తండాకు వెళ్లినా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ బిజెపి బైక్ యాత్రకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను కావల కుక్కలా ఉండి దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి తీరా తెలంగాణ వచ్చాక దళిత జాతికి ద్రోహం చేసి ముఖ్యమంత్రి పీటెక్కిన దళిత ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి, గిరిజనులకు, వాల్మీకి బోయలకు రిజర్వేషన్ పెంచుతానని హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కాడని, రైతులకు సరిపడా ఎరువులు ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుందని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికాడని, లక్ష రూపాయలు ఒకే దఫా మాఫీ చేస్తానని రుణమాఫీని అటకెక్కించాడని, రైతుబంధు పేరుతో ఇన్పుట్ సబ్సిడీ,క్రాప్ లోన్లు,బ్యాంకులు వడ్డీ లేని రుణాలు రాకుండా రైతు నెత్తిన శఠగోపం పెట్టాడని,తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని నమ్మబలికి ఎనిమిది సంవత్సరాలైనా ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వని దుర్మార్గుడని, మన ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని 24 లక్షల కుటుంబాలకు రెండు పడకగదులు ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చి ఊరికి ఒక ఇల్లు కూడా పంపిణీ చేయని మోసకారి సీఎం కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపి అని బలంగా విశ్వసిస్తున్నారని అందుకు నిదర్శనం దుబ్బాక,జిహెచ్ఎంసి, హుజూరాబాద్ ఎన్నికలలో ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారని రాష్ట్రంలో బిజెపి క్రమంగా బలపడుతున్న వైనాన్ని జీర్ణించుకోలేని కేసీఆర్ విభజన రాజకీయాలకు తెర లేపాడని 16 రాష్ట్రాలలో ప్రవేశాన్ని నిషేధించిన ఒక పనికిరాని మునవర్ ఫారుకి కమెడియన్ షో కి 1600 మంది టికెట్లు బుక్ చేసుకుంటే 2000 మంది పోలీసులతో శిల్పకళా వేదికను అప్పగించి,వాడి చేత హిందూ ఆరాధ్య దేవతలైన సీతారాములను తిట్టించి విభజన రాజకీయాలకు కేసీఆర్,కేటీఆర్ తెర లేపారని విమర్శించారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి పేరు బయటికి రావడంతో తెలంగాణ ప్రజలు కవిత గారి పాత్ర గమనిస్తున్నారని తెలిసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని, కరెంటు ఆర్టీసీ తదితర అన్ని రకాల చార్జీల పెంపుతో నడ్డి విరుస్తున్నాడని విమర్శించారు.
నియోజకవర్గంలో స్థానిక మంత్రి నీళ్ల నిరంజన్ రెడ్డి పేరుతో తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నాడని, గత ప్రభుత్వాలు పూర్తిచేసిన సాగునీటి కాలువలను కొంతమేర పూర్తి చేసి నేనే ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకొస్తున్నానని దర్పణం చెల్లాయిస్తున్నాడని విమర్శించారు. 2013 ఎన్నికలకు ముందు స్థానిక మంత్రి నిరంజన్ రెడ్డి పరిస్థితి అందరికి తెలుసని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి వందలాది ఎకరాల వ్యవసాయ క్షేత్రాలు, వేలకోట్ల అక్రమ సంపాదన వెనకేసుకున్నాడని, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను, ప్రభుత్వ భూములను,చెరువులను, గుట్టలను అన్నిటిని మింగేస్తున్నాడని, వనపర్తి జిల్లాగా ఏర్పడితే రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చదిద్దుతానని హామీ ఇచ్చి నేడు పూర్తిగా అవినీతిమయమయ్యాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతి ఇస్తే రాబోయే డబుల్ ఇంజన్ సర్కారులో తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అక్రమంగా సంపాదించినదంతా కక్కిస్తానని దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాగోస బిజెపి భరోసా యాత్ర వనపర్తి ఇన్చార్జ్ దేవకి వాసుదేవరావు, బిజెపి రాష్ట్ర నాయకులు అశ్వద్ధామ రెడ్డి, జిల్లా ఇన్చార్జి బోసు పల్లి ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కృష్ణ, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం, నాగర్కర్నూల్ పార్లమెంట్ కో కన్వీనర్ జింకల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నారాయణ, మాధవరెడ్డి,రామన్ గౌడ్, శ్రీరంగపురం మండల అధ్యక్షుడు వెంకటస్వామి, పెబ్బేరు మండల అధ్యక్షుడు భగవంతు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గౌని హేమారెడ్డి, బండారు కుమారస్వామి, ఏ. సీతారాములు, ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ కౌన్సిలర్ గోపి బాబు, కోశాధికారి భాసెట్టి శీను, కార్యదర్శులు చిత్తారి ప్రభాకర్, పరుశురాం,చెన్నయ్య, శివారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు బచ్చు రాము, పెద్దిరాజు, బాబురావు, గోనెల సహదేవుడు, బుచ్చిబాబు గౌడ్, సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మోర్చాల అధ్యక్షులు అనుజ్ఞ రెడ్డి, ఆగ పోగు కుమార్, ఎండి కరీం, ఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Attachments area