డబ్బులు పదవులు ఆశపెట్టి కాంగ్రెస్ పార్టీ లోకి పిలుచుకుంటున్నారు
-విలేఖర్ల సమావేశం లో బి జె పి రాష్ట్ర కార్యవర్గ గడ్డం కృష్ణారెడ్డి. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి); డబ్బులు ,పదవులు ఆశపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి బిజెపి కార్యకర్తలను పిలుసు కుంటున్నారని, మేము కూడా కార్యాచరణ మొదలు పెడతామని, మేము తయారు చేసుకున్న కార్యకర్తల జోలికి రావద్దని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డి కె బంగ్లాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి అన్నారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రం లో, రాష్ట్రంలో, బలమైన పార్టీ అని బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జ్ లు బలమైన కార్యకర్తలు ఉన్నారని కచ్చితంగా రాష్ట్రంలో ,గద్వాల నియోజకవర్గం లో డికె .అరుణ గెలుపు తో బిజెపి జెండా ఎగరవేస్తామని అన్నారు.
గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందిందంటే డీకే అరుణ కృషి అని అన్నారు. గ్రామస్థాయిలో సేవ చేసినటువంటి డీకే అరుణ ని గ్రామాల్లో పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఈరోజు నెట్టెంపాడు ప్రాజెక్టు వల్ల రెండు లక్షల ఎకరాలకు నీరు అందించి రైతులు సస్యశ్యామలంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందారు అంటే దానికి కారణం డికె.అరుణ అని అన్నారు.. గ్రామస్థాయిలో లేనటువంటి పార్టీ అధికారంలోకి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో ప్రతిష్టమైనటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో గద్వాల ప్రాంతంలో ఆరుణ నాయకత్వంలో బలంగా ముందుకు పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ..
ప్రతి కార్యకర్తకు అండగా వుంటూ ఏ అర్దరాత్రి ఆపద వచ్చిన నేను ఉన్నానంటు పని చేసే నాయకురాలు అరుణ.కింది స్థాయి నుండి పనిచేసుకుని, పదవులు పొంది తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ ,డికె.అరుణ వైపు ఉన్నారని కచ్చితంగా బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు ,జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాల్వాయి రాముడు, బిజెపి నాయకులు అరుణ్, పేపర్ నరసింహ,వంశీ తదితరులు ఉన్నారు.