డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి.

చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ లలో లోన్ తీసుకోని ….విలువైన ప్రాణం ని పణంగా పెట్టకండి …చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ లలో లోన్ తీసుకోని ….విలువైన ప్రాణం ని పణంగా పెట్టకండి …
సైబర్ మోసం జరిగిన వెంటనే స్పందించి 1930 కి కాల్ చేస్తే మోసపూరిత డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా ఫ్రీజ్ చేయవచ్చు
NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. : పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్.,(ఐజి)పెద్దపల్లి బ్యూరో (జనం సాక్షి )జూలై 23:ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు అధికమతున్నాయి. స్మార్ట్ ఫోన్ ల  వినియోగం విరివిగా అందుబాటులోకి రావడంతో నిత్యం ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మారింది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రోజుకోరకంగా దోచుకుంటున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఏటీఎం కార్డుల నెంబర్లు, ఇతర వివరాలు అడుగుతున్నారు. మీకు పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది. కొన్నివివరాలు చెబితే రూ. 50వేల నుంచి రూ. 1లక్ష వరకు మీ ఖాతాలో జమ అవుతాయని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో లోన్ అప్లికేషన్ల యొక్క మోసాలు ఎక్కువవుతున్నందువలన తక్షణ అవసరాల కోసం లోన్ యాప్ ల ద్వారా  లోన్ తీసుకోవద్దు అని ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మహత్యలకి పాల్పడవద్దని సిపి గ సూచించారు. లాటరీలో మీరు బహుమతులు గెలుచుకున్నారని, బహుమతులకు ఎంపికయ్యారని మాయచేసి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నవారిని తేలికగా ప్రలోభపెడుతున్నారు. వీరి వలలో పడిన వారు ఆర్థికంగా నష్టపోయి, మానసికంగా కుంగిపోతున్నారు. ఒకవేళ అనుకొని పరిస్థితిలో సైబర్ మోసానికి గురి అయితే 1930 లేదా డయల్ 100 లేదా(www.cybercrime.gov.in) వెబ్ సైట్ ద్వారా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని తక్షణ  ఫిర్యాదుతో పోగొట్టుకున్న నగదును తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఫిర్యాదు అందిన తరువాత సంబంధిత పోలీసు అధికారులు పరిశీలించి, ధృవీకరించి అట్టి విషయాన్ని బ్యాంకులకు, ఏ వాలెట్ ద్వారా నగదును కోల్పోయారో ఆ యాజమాన్యానికి పంపి కోల్పోయిన నగదును నేరగాళ్లకు చెందకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త గా ఉండాలని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్.,(ఐజి)  సూచించారు.
సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే …సైబర్  పోలీసుల  వారి సూచనలు తప్పక పాటించండి:
1. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటే నమ్మవద్దు. ఏ ఫీజూ కట్టవద్దు.2. రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్ ల నుంచి లోన్ తీసుకోకండి, వారు పెట్టె బాధలకు గురికావొద్దు.3. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ వస్తే యాక్సెప్ట్ చేయకండి.4. . కస్టమర్ కేర్ నెంబర్ ల కొరకు ఎట్టిపరిస్థితుల్లో గూగుల్ లో వెతకకండి సంబంధిత అధికారిక వెబ్ సైట్  అప్లికేషన్స్ లోనే ఫిర్యాదుల కొరకు నెంబర్ ఉంటుంది5. . ANY Desk application డౌన్లోడ్ చేసుకోమని ఎవరైన చెప్పితే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గ్రహించండి.6. . Instagram, Face book & You tube లలో వచ్చే ఎటువంటి యాడ్ లను చూసి ఎటువంటి వస్తువులు కొనవద్దు మోసపోవద్దు.7. . ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఎవరైనా డబ్బులు కట్టమంటే కట్టవద్దు.8. . వివాహ సంబంధ వెబ్‌సైట్లలో వ్యక్తిని చూడకుండా ఆకర్షణకు లోను కావద్దు. డబ్బులు ఎవరి ఖాతాలోనూ వెయ్యవద్దు.9. . OLX, Quikr, Cardeko వెబ్‌సైట్లలో వస్తువులను డైరెక్టుగా చూడకుండా, అమ్మే వ్యక్తులను డైరెక్టుగా కలవకుండా ముందుగా డబ్బులు కట్టవద్దు.10. ఎవరైనా మెసేజ్/కాల్ చేసి మీకు లోన్ అప్రూవ్ అయ్యింది అని అంటే నమ్మకండి.11. . బహుమతి వచ్చిందంటూ మీకు తెలియని వ్యక్తుల నుంచీ మెసేజ్ వస్తే అస్సలు నమ్మవద్దు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు…
1. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి సైబర్ నేరగాడు కాల్ చేసి మీ వ్యవసాయ భూమిలో సెల్ ఫోన్ టవర్ పెట్టుకుంటాను దానికోసం మీకు నెలనెలా కొంత డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు.. సెల్ఫోన్ టవర్ పెట్టడానికి రిజిస్ట్రేషన్ కోసం Rs. 5200 పే చేయాలి అని చెప్పగా బాధితులు పే చేశాడు. ఆ తర్వాత అది మోసమని గ్రహించాడు.
2. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు ఫేస్బుక్లో ఫోన్ల అమ్మకం గురించి అడ్వర్టైజ్మెంట్ చూసి అతనికి కాంటాక్ట్ అయ్యాడు. సైబర్ నేరగాడు 2000 రూపాయలు అడ్వాన్స్ పంపండి ఫోన్స్ మీకు కొరియర్ చేస్తాను అని చెప్పగా బాధితుడు పంపాడు. ఆ తరువాత ఇదే విధంగా పలు రకాల కారణాలు చెప్పి మొత్తం తొమ్మిది వేల రూపాయలు కొట్టేశాడు.

3. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితునికి మీ SBI YONO app లో PAN CARD డీటెయిల్స్ అప్డేట్ చేయండి లేకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుంది అని మెసేజ్ వచ్చింది. బాధితులు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి YONO యొక్క  యూజర్ name & password ఎంటర్ చేశాడు, ఆ తరువాత తాను రిసీవ్ చేసుకున్న OTP లు కూడా ఎంటర్ చేశాడు, వెంటనే బాధితుడు ఎకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినాయి.
4. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితురాలికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మేము ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు 22000 శాంక్షన్ అయినాయి, ఫోన్ పే లో ఒక లింకు పంపిస్తాను ఆ లింకు ప్రెస్ చేసి మీ పాస్వర్డ్ టైప్ చేస్తే అమౌంట్ మీ అకౌంట్లో పడతాయి అని చెప్పగా బాధితురాలు అలాగే చేయగా బాధితురాలు ఎకౌంట్ నుంచి Rs 10 వేలు డెబిట్ అయినాయి.

5. పెద్దపల్లి పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి పార్ట్ టైం జాబ్ గురించి మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిష్టర్ అయిన తర్వాత WhatsApp లో మరోక లింక్ పంపి, ఈ లింక్ క్లిక్ చేయండి కొన్ని వస్తువులు ఉంటాయి, ముందు మీరు ఆ వస్తువులను మీ డబ్బులతో కొనండి తర్వాత కమిషన్ తోపాటు మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాము అని చెప్పగా, Rs. 50 వేలు తో పలు దఫాలుగా కొన్ని వస్తువులను కొన్నాడు, కమిషన్ తో కలుపుకొని మొత్తం డబ్బు వ్యాలెట్ లో కనిపిస్తుంది కానీ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదరట్లేదు.
6. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు ఆన్లైన్లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాడు. ఆ వస్తువులు ఇంకా డెలివరీ కాకపోయేసరికి గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ గుత్తి కాల్ చేయగా సైబర్ నెరగాడు ఒక లింకు పంపించాడు బాధితుడు ఆ లింకు ప్రెస్ చేయగా ANY DESK అప్లికేషన్ డౌన్లోడ్ అయింది. బాధితుడు ANY DESK యొక్క ఐడిని, ATM కార్డు వివరాలను  సైబర్ నేరగాడికి చెప్పాడు. ఎన్ని డిస్క్ అప్లికేషన్ ద్వారా బాధితుడు రిసీవ్ చేసుకున్న ఓటీపీలను చూసిన సైబర్ నేరగాడు 4000 రూపాయలు కొట్టేశాడు.

7. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు Cashbus అని లోన్ అప్లికేషన్లు 2500 లోన్ తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీని మీరు తిరిగి చెల్లించలేదు మరలా చెల్లించాలి లేకపోతే మీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి పంపిస్తాము అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
8. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి లోన్ శాంక్షన్ అయింది అని మెయిల్ వచ్చింది. బాధితుడు ఆ మెయిల్ పంపించిన వారికి కాంటాక్ట్ అవ్వగా. ఆ మెయిల్ పంపించినవారు (సైబర్ మోసగాళ్లు) మీరు ముందు ప్రాసెసింగ్ ఫీజు, టాక్స్ కోసం కొంత డబ్బులు చెల్లించాలి అని కోరగా బాధితుడు 22000 పంపించాడు. తర్వాత మోసపోయానని గ్రహించాడు

9. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు Creditbe అని లోన్ అప్లికేషన్లు లోన్ తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీని మరలా తిరిగి చెల్లించాలి అని చెప్పడంతో గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి కాల్ చేయగా ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (సైబర్ మోసగాళ్లు) Any desk అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పగా డౌన్లోడ్ చేసుకొని any desk ID, తన క్రెడిట్ కార్డ్ వివరాలు మరియు ఓటీపీలు కూడా చెప్పాడు, దాంతో బాధితుడి ఎకౌంటు నుంచి 2000 రూపాయలు