డయల్ యువర్ కమిషనర్‌కు 26 ఫిర్యాదులు
విజయనగరం, జూలై 16 : విజయనగరం పట్టణంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 26 మంది మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామికి ఫిర్యాదు చేశారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర సిబ్బంది కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో వేళాపాళా లేని విద్యుత్ కోతలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సమస్యలపై ఫిర్యాదులందాయి. వీటిని పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు గోవిందస్వామి చెప్పారు.