డాక్టర్ కఫీల్ ఖాన్ నీకు స‌లామ్‌

నిఫావైర‌స్ రోగుల‌కు వైద్యం అందించ‌డానికి స్వచ్చందగా  ముందుకు

అహో రాత్రులు చిన్నారుల ప్రాణాలు కాపాడిన డాక్టర్ ను ఆక్సిజన్ సరఫరా చేయలేని సర్కారు చివరకు వైద్యున్నే నేరస్తుణ్ణి చేసి జైలుకు పంపింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభత్వం .మానవ సేవే పరమావధిగా భావిన్చే డాక్టర్ తన ప్రాణాన్ని సైతం లెక్కచేయక ఆ వైద్యుడు డే స్వచ్చందగా నిఫా వైరస్ రోగులకు సేవలందించేందుకు ముందుకు వచ్చాడు .కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్‌కు బలయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో ఆ బాధితులకు చికిత్స అందిస్తానంటూ కఫీల్‌ఖాన్‌ ముందుకొచ్చారు. ఇందుకు కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా అంగీకరించి ఆయన్ని రాష్ట్రానికి ఆహ్వానించారు.

కేరళలో నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా 10 మంది బలయ్యారు. కోజికోడ్‌లో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీని గురించి తెలుసుకున్న డా. కఫీల్‌ ఖాన్‌ చికిత్స అందిస్తానంటూ ముందుకొచ్చారు. ‘నిఫా వైరస్‌ మరణాలు, దానిపై సోషల్‌మీడియాలో వస్తున్న కథనాలు, వదంతులు విని చాలా కలత చెందాను. నిద్ర కూడా పట్టట్లేదు. ఆ బాధితుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నా. ఇందుకోసం కాలికట్‌ మెడికల్‌ కళాశాలలో పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ను కోరుతున్నా. నిఫా వైరస్‌ బాధితులకు చికిత్స అందిస్తూ.. అదే వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన సిస్టర్‌ లిని ఎందరో వైద్యులకు స్ఫూర్తిదాయకం. ఓ మంచిపని కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధమే’ అని డాక్టర్ ఖాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

కలీఫ్‌ ఖాన్‌ అభ్యర్థనను కేరళ సీఎం విజయన్‌ అంగీకరించారు. నిఫా బాధితులకు సేవ చేయాలనుకుంటున్న ఖాన్‌ లాంటి వైద్యులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు. ‘తమ జీవితాలను, ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా రోగులకు సేవ చేసే వైద్యులు ఎంతోమంది ఉంటారు. వారిలో ఖాన్‌ కూడా ఒకరు’ అని ప్రశంసించారు.

గతేడాది యూపీలోని గోరఖ్‌పూర్‌లో గల బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో ఆక్సిజన్‌ అందక 60మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను ప్రధాన నిందితుడుగా పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.