డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మంతటి గోపి మాదిగ.
మరింత బాధ్యత పెరిగింది.
-తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జీ మంతటిగోపి మాదిగ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి ):
బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంస్థ నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదగా
నాగర్ కర్నూల్ మండల పరిధిలోని మంతటి గ్రామానికి చెందిన తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జీ మంతటిగోపి మాదిగ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మంతటి గోపి మాట్లాడుతూ దళితుల సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా,న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తానని అన్నారు.దళిత బహుజనుల పక్షాన పోరాటం చేస్తున్నందుకు, బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని,ఈ అవార్డు ద్వారా నా బాధ్యత పెరిగిందని అన్నారు.అంబేద్కర్ నేషనల్ అవార్డు రావడం పట్ల నాపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.ఈ అవార్డు రావడానికి కృషిచేసిన తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు యం. గౌతమ్, సంతు రవిదాస్ సంస్థ అధ్యక్షులు ఆకుపకు ప్రమోదు, తెలంగాణ దండోరా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈదునూరి నాగమణి మాదిగ, మహిళ ప్రధాన కార్యదర్శి రుద్రమదేవి, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్, తెలంగాణ దండోరా నాయకులు రవికుమార్, డి. కురుమయ్య, రజనీకాంత్, బహుజన సాహిత్య అకాడమీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.