డాక్‌ ఉద్యోగులు కనీస జీతాలకు అర్హులు కాదా?

సమ్మె చేస్తున్నా పట్టించుకోని కేంద్రం
న్యూఢిల్లీ,మే26(జ‌నం సాక్షి): బ్యాంకులతో పాటుగా తపాలా వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలన్న సంలక్పం నెరవేరడం లేదు. తపాలా సేవలు మారిన క్రమంలో ఆధునిక పద్దలతులకు అనుగుణంగా దానిని తీర్చిదిద్దాల్సి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ కీనస వేతనాలు లేకుండా పనిచేస్తున్న డాక్‌ ఉద్యోగులను మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో వీరు నిరవధిక సమ్మెకు దిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాలాశాఖలోని 2.75 లక్షల మంది గ్రావిూణ డాక్‌ సేవకులు అతి తక్కువ వేతనాలు పొందుతున్నారు. కనీస వేతనం రూ.6,000 గరిష్టంగా రూ.12,000 ఉంది. లీవులు, అడ్వాన్సులు, మెడికల్‌ ట్రీట్‌మెంట్‌, ఇంటి అద్దె అలవెన్సులు లాంటివేవీలేవు. పెన్షన్‌ సౌకర్యం అస్సలే లేదు. పదవీ విరమణ తరువాత సర్వీసును బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు సెవరెన్సు అలవెన్సు పేరుతో చెల్లిస్తారు. 1984 సెప్టెంబరు 19న ఒకరోజు దేశవ్యాపిత సమ్మె ఫలితంగా కరువు భత్యం, ఎక్స్‌గ్రేషియా, బోనస్‌ సాధించారు. ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు అసలే లేవు.  గ్రావిూణ తపాలా ఉద్యోగులకు, సివిల్‌ సర్వెంట్‌ ¬దా కల్పిస్తూ కమలేష్‌ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జీడీఎస్‌, దేశ వ్యాపితంగా ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. అదేవిధంగా నిలుపుదల చేసిన జీడీఎస్‌ మెంబర్‌షిప్‌ పక్రియ ప్రారంభించి గుర్తింపు యూనియన్‌ ఫలితాలను ప్రకటించాలి. ఈ రెండు డిమాండ్ల సాధనకు జీడీఎస్‌ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. డిమాండ్ల సాధన కోరుతూ ఏప్రిల్‌లో దశలవారీ ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేదు. గతేడాది ఆగష్టు 23న దేశవ్యాపితం గా ఒక రోజు సమ్మె చేసినా ఫలితం రాలేదు.  ప్రభుత్వాధికారులు యూనియన్లతో జరిపిన చర్చలు ఫలించలేదు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేసినా, ఎలాంటి సౌకర్యాలు వర్తించవు. పేరుకు పార్ట్‌ టైం ఉద్యోగులు 4 నుంచి 5 గంటల పని అని చెప్పినా, రోజుకు 8 గంటలు కూడా పని చేస్తున్నారు. పేరుకు జీడీఎస్‌ ఉద్యోగులుగానీ, పీఐల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ బిజినెస్‌ చేయాలి. ఆధార్‌ ఎన్రోల్‌మెంట్సు చేయాలి. ఎన్‌ఆర్‌జీఈజీఎస్‌తో బాటు, ఆసరా పెన్షన్‌ పేమెంట్లు కూడా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు, ప్రతిష్టాత్మకంగా
ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ‘ఆసరా’, ‘భరోసా’ పెన్షన్‌ స్కీమ్‌లను గ్రావిూణ ప్రాంతాలలో అమలు చేస్తున్నారు. పెంచిన జీతాలు అమలు చేయాలంటే ప్రభుత్వానికి కేవలం రూ.600 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఆ డబ్బులు కూడా లేవని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. 70 శాతం ఆదాయం, ఈ జీడీఎస్‌ ఉద్యోగుల ద్వారా తపాలాశాఖకు వస్తుంది. అలాంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం, అధికారులు కనికరం లేకుండా వ్యవహరించడాన్నిఉద్యోగుల సంఘం తీవ్రంగా గర్హిస్తున్నది. కొన్ని దశాబ్దాలుగా అన్ని కేంద్ర ప్రభుత్వాలు, జీడీఎస్‌ ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నాయి.జీడీఎస్‌ ఉద్యోగులను 7వ వేతన పరిధిలోకి తీసుకురావటానికి అధికారులు అంగీకరించారు. అయితే ప్రభుత్వం మాత్రం గుర్తింపు కలిగిన యూనియన్‌ అండతో కమలేష్‌ చంద్ర కమిటీని వేసింది. ఆ కమిటీ తన రిపోర్టును 2016 నవంబరులో సమర్పించి 18 నెలలు దాటినా అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో 2017 సెప్టెంబరులో డిపార్టుమెంటు, జీడీఎస్‌ ఉద్యోగ సంఘాల గుర్తింపు కోసం వెరిఫికేషన్‌ పక్రియ చేపట్టింది.  ఉద్యోగుల పక్షాన నిలబడి వారి కోసం పోరాడే ఎన్‌ఎఫ్‌పీఈ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వడం ఇష్టంలేక ఆ పక్రియను రద్దు చేశారు. ఎన్‌ఎఫ్‌పీఈతోబాటు మిగతా యూనియన్లు సమ్మెలో ఉన్నాయి.ఇప్పటికయినా జీడీఎస్‌ ఉద్యోగుల జీవితాలలో, వెలుగులు నింపాలని, సమ్మె పూర్తి విజయవంతమై, జీతభత్యాలు పెరగాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు, జీడీఎస్‌ ఉద్యోగుల సమ్మెకు దేశవ్యాపి తంగా అన్నివైపుల నుంచి అన్ని తరగతుల సంఘాల నుంచి అన్ని వర్గాల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాపితంగా, జీడీఎస్‌ యూనియన్‌లో వున్న అన్ని యూనియన్లు ఈ నెల 22 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించి సమ్మె నోటీసు ఇచ్చి  డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించేదిలేదని తెలిపాయి. ఆ మేరకు సమ్మె కొనసాగుతున్నా ఇంతవరకు వారిని పిలిచి మాట్లాడాలనే ఆలోచన చేయడం లేదు.