డిఎస్ తనయుడు సంజయ్‌పై మరో కేసునమోదు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
ఇంటికి నోటీసులు అంటింపు
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): టిఆర్‌ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కుమారుడు బిజెపి నాయకుడు సంజయ్‌పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే నిర్భయ చట్టం కింద సంజయ్‌పై కేసు నమోదు కాగా, తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో విచారణకు రెండు రోజుల్లో పోలీసుల ఎదుట హాజరు కావాలని సంజయ్ ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. 41/ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నెల 12వ తేదీ లోపు హాజరుకాని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సంజయ్ ఇంటికి అతికించిన నోటీసులను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అయితే సంజయ్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 11మంది నర్సింగ్ విద్యార్థినులు ఇటీవలే ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ¬ంమంత్రి సూచన మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయశర్మను కలిసి విద్యార్థినులు ఫిర్యాదుచేశారు. బాధిత విద్యార్థినుల వెంట వారి తల్లిదండ్రులతో పాటు పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్ సంఘాలకు చెందిన నాయకులు ఉన్నారు. తమకు ప్రాణభయమున్నదని, లైంగిక వేధింపులకు పాల్పడిన సంజయ్‌ను శిక్షించాలని ఈ సందర్భంగా విద్యార్థినులు సీపీని కోరారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు సంజయ్‌పై నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అనంతరం పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లగా అప్పటికే పరారీలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత తన నివాసంలో ప్రెస్‌విూట్ పెట్టి తనకు ఏ పాపం తెలియదని చెప్పిన సంజయ్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సంజయ్ కోసం గాలింపు చేపడుతున్నామని, అతనిపై నిర్భయతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ నరేశ్ వెల్లడించారు.