డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సద్వినియోగం చేసుకొండి గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్.

అలంపూర్ జనంసాక్షి( సెప్టెంబర్ 17)
డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంకు అలంపూర్ శాఖమేనేజర్ వెంకటేశ్వర్లుఅన్నారు. అలంపూర్ మండల పరిధిలోని కాశాపూర్ గ్రామంలోశనివారం గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎంపీపీ గోకరిబేగం మరియు రైతు సేవాసంఘం అద్యక్షులు జి.గోపాల్ అధ్యక్షతన ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ వెంకటేష్ మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు.అంతే కాకుండా ఖాతాదారులు సైబర్ మోసాలకు గురి కావద్దని, బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు ఫోన్ చేసి పిన్, ఓటీపీ నంబర్లు అడుగరని, అపరిచితులు ఎవరైనా అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దన్నారు. కేవైసీ నిబంధనలు, డిజిటల్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ లపై అవగాహన కల్పించారు.డిజిటల్ సేవాల ఉపయోగం వల్ల బ్యాంకు కు డైరక్టగా రావలసిన అవసరం వుండదని , ఎక్కడ నుండియైన లావాదేవీలు జరుపుకోవచు, సమయము వృదాకాదని తెలిపారు. ఆన్ లైన్ లో ఓటిపి నెంబర్ ఇవ్వడం గాని ఖాతాదారులను ఇటువంటివి ఏమి చేయవద్దనిఅన్నారు.బ్యాంకు అధికారులు ఎప్పుడు కూడా ఖాతాకు సంబంధించినవి వివరాలను పోన్ లలో అడుగరన్నారు. అన్ లైన్ సేవాలు వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతులు సకాలంలో రుణాలను కట్టి రెన్యూవల్ చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలును పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాండురంగారావు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.