డిపెండెంట్ ఉద్యోగాలపై త్వరలో నిర్ణయం
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే12(జనంసాక్షి): సింగరేణి డిపెండెంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఎం కెసిఆర్‌ను ఎమ్మెల్యేలు కోరారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ కలిశారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. సింగరేణి డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో దాదాపు 28 వందల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ కొద్ది రోజుల్లోనే సింగరేణి అధికారులతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేతలకు హావిూ ఇచ్చారు. ఎంతోకాలంగా ఈ సమస్య పెండింగ్‌లో ఉంది.