డి ఎస్ ఇ ముట్టడి పోస్టర్ ఆవిష్కరణ .

,

మల్లాపూర్(జనంసాక్షి ) జులై :19
మోడల్ స్కూల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 28వ తారీఖున తలపెట్టిన DSE ముట్టడిని విజయవంతం చేయాలని టి ఎస్ ఎం ఎస్ టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అందే సురేందర్ ఒక ప్రకటనలో కోరారు ఈరోజు మల్లాపూర్ స్కూల్ ఆవరణ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ముట్టడికి సంబంధించిన సమావేశము మరియు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఇట్టి సమావేశం లో అధ్యక్షుడు మాట్లాడుతూ వెంటనే టీచర్లకు 317 అమలుపరిచి బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇట్టి సమావేశంలో ప్రిన్సిపల్ ఆలీముద్దీన్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు