డీఎంకే సభ్యులంతా సస్పెన్షన్‌

1

చెన్నై,ఆగస్టు 17(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీ నుంచి డీఎంకే పార్టీకి చెందిన మొత్తం 89 మంది ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై తీవ్ర విమర్శలు చేసినందుకు కరుణానిధి నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకేలోని ఎమ్మెల్యేలనంతా అసెంబ్లీ నుంచి బయటకు పంపారు. జయలలిత 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చేలా చేస్తున్నారని, ఆమె డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ తీవ్ర ఆందోళనలు చెయ్యడంతో అసెంబ్లీ స్పీకర్‌ పి.ధనపాల్‌ డీఎంకే నేత స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలనందరినీ వారం పాటు సభకు రాకుండా చేశారు.సభలో గందరగోళం నెలకొనడంతో డీఎంకే ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపారు. స్టాలిన్‌ను ఏకంగా భద్రతాసిబ్బంది ఎత్తి బయటకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిని అగౌవపరిచేలా మాట్లాడారని జయలలిత తరపు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.ముఖ్యమంత్రిని అగౌవపరిచేలా మాట్లాడారని జయలలిత తరపు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల పట్ల గౌరవంగా ఉండాలని.. వీళ్లు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే అని డీఎంకే అధికార ప్రతినిధి మను రాజ్‌ సుందర్‌ అన్నారు.ఈ వ్యవహరాం తమిళనాట తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. సిఎం నరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.