డెంగ్యూ పట్ల అప్రమతంగా ఉందాం…
-లైఫ్ చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ పరుశరాముడు…
గద్వాల రూరల్ సెప్టెంబరు 16 (జనంసాక్షి):- గద్వాల పట్టణంలోని గంజిపేట కాలనీ 14వ వార్డు, ఆశ కార్యకర్తలతో లైఫ్ చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ పరుశరాముడు, బ్లీడ్ చెకర్ నిస్సి రాయ్ డెంగ్యూ నివారణ పట్ల ఇంటింటా అవగాహన కల్పించారు..డెంగ్యూ నుండి రక్షణ మన చేతుల్లోనే ఉంది..మనము మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను మరియు మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. నీటిని నిల్వ చేసే ప్రాంతాలను శుభ్రపరచి వాటిపై మూతలు ఉంచాలి. దోమల నియంత్రణ మందులు మరియు దోమ తెరలు ఉపయోగించండి. దోమకాటు బారిన పడకుండా పొడుగు దుస్తులను ధరించండి. డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరం, దగ్గు, తీవ్రమైన తలనొప్పి, కిళ్ల నొప్పులు, డిహైడ్రెషన్, వాంతులు, వీరేచనాలు, బలహీనంగా అనిపించడం కడుపులో నొప్పి వంటివి ఉంటాయి. డెంగ్యూ వ్యాధి నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. బ్లీడ్ చెకర్ నిస్సి రాయ్ , లైఫ్ చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ పరుశరాముడు ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించారు.
Attachments area