డేంజర్ జోన్ నివాస గృహాలన్నీటీకి డిఎన్ డిడి నోటిఫికేషన్ వేయాలి

2010 లో సర్వే చేసిన ఇండ్లకు మాత్రమే నోటీపీకేషన్ వేస్తామనడం దుర్మార్గమైన చర్య
నిర్వాసితులను మోసం చేస్తే సహించేది లేదు
తహశీల్దార్ కు వినతిపత్ర అందజేత
 మల్హర్, జనంసాక్షి
మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపికి డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న భూములు, జెన్కో టీఎస్ నెంబర్లు వేసిన ఇండ్లన్నీటికి డిఎన్ డిడి నోటీపీకేషన్ ఒకేసారి వేయాలని భూ నిర్వాసితుల కమిటీ ఉపాధ్యక్షుడు తాండ్ర మార్కు, డివైఏప్ఐ మండల కార్యదర్శి ఇందారపు శివ డిమాండ్ చేశారు.శుక్రవారం మండల తహశీల్దార్ జీవాకర్ రెడ్డికి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గనికి 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న భూములు,ఇండ్లు,చెట్లు, ఇల్లు,చెట్టు,బావులు, ఇతరత్రవన్నీ సేకరిస్తామని రెవెన్యూ, జెన్కో అధికారులు టిఎస్ జెన్కో నెంబర్ల ప్రకారం ఒకేసారి పబ్లికేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.నోటీపీకేషన్ విషయంలో  రెవెన్యూ, జెన్కో అధికారులు భూ నిర్వాసితులను మోసం చేయడానికి పన్నాహం పొందుతున్నట్లుగా తెలిసిందన్నారు.జెన్కో అధికారులు డేంజర్ జోన్లోవున్న మొత్తం 2,260 ఇండ్లకు నెంబర్లు వేసి, ప్రస్తుతం  2010 లో సర్వే చేసిన ఇండ్లను మాత్రమే నోటీపీకేషన్ వేసేందుకు సిద్ధం చేయడం దుర్మార్గపు చర్యని చెప్పారు.పాత, కొత్త ఇండ్లన్నీ డేంజర్ జోన్లోనే,అదికూడా గ్రామపంచాయతీ పరిధిలోనే ఉన్న విషయాన్ని అధికారులు గమనించాలన్నారు. స్థానిక భూ నిర్వాసితులకచ అన్యాయం జరిగితే  సహించమని, నిర్వాసితుల తరుపున పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని హెచ్చరించారు. గ్రామపంచాయతీ రికార్డుల్లో, ఈ పంచాయతీ ఆన్లైన్లో ఉన్న స్థానికుల ప్రతి గృహాన్ని నోటిఫికేషన్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు ఇందారపు ఎల్లయ్య,ఇందారపు సురేష్,షేక్ జిషాన్, విష్ణు,స్వామి,మంథని సమ్మయ్య, పాల్గొన్నారు.