డైలమాలో యూసుఫ్‌ కెరీర్‌ భారత్‌ టూర్‌కు చోటు లేదన్న పీసీబీ

లా¬ర్‌, డిసెంబర్‌ 5: పాకిస్థాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌ మన్‌ మహ్మద్‌ యూసఫ్‌ కెరీర్‌ ముగిసినట్టే కనిపి స్తోంది. గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యూసఫ్‌ను రాబోయే భారత్‌ టూర్‌కు పరిగణలోకి తీసుకోవడం లేదని పిసిబీ చీఫ్‌ సెలక్టర్‌ ఇక్బాల్‌ ఖాసిం చెప్పారు. భారత పర్యటనలో పాకిస్థాన్‌ రెండు టీ ట్వంటీలు, మూడు వన్డేలు ఆడనున్న నేపథ్యంలో జట్టు ఎంపికపై ఖాసిం స్పందించారు. యూసఫ్‌ ఫామ్‌, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని అత న్ని పక్కన పెట్టినట్టు తెలిపారు. యూసఫ్‌ దాదాపు ఏడాదిన్నర కాలంగా కనీసం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కూడా ఆడలేదు. అయితే ప్రస్తుతం పాక్‌లో జరుగుతోన్న నేష నల్‌ టీ ట్వంటీ ఛాంపియన్‌షిప్‌లో లా¬ర్‌ లయ న్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. కానీ మొదటి మ్యాచ్‌ తర్వాత పాక్‌ టీ ట్వంటీ కెప్టెన్‌ మహ్మద్‌ హఫీజ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాడు. ఇదిలా ఉంటే యూసఫ్‌ భారత్‌ పర్యటన కోసం సిధ్దంగా లేడని, వచ్చే ఏడాది జరిగే సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడాలని భావిస్తున్నట్టు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. యువక్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే నేషనల్‌ టీ ట్వంటీ టోర్నీ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. 38 ఏళ్ళ యూసఫ్‌ ఇప్పటి వరకూ 90 టెస్టుల్లో 7530 పరుగులు చేశాడు. వీటిలో 24 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచ రీలు ఉన్నాయి. అలాగే 288 వన్డేల్లో 9720 పరు గులు సాధించాడు. వీటిలో 15 సెంచరీల, 64 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్‌తో సిరీస్‌ కు అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తామని పాక్‌ చీఫ్‌ సెలక్టర్‌ ఖాసిమ్‌ చెప్పారు. సిరీస్‌లో విజయం సా ధిస్తే సౌతాఫ్రికా పర్యటనకు ముందు పాక్‌ జట్టుకు కాన్ఫిడెన్స్‌ పెరుగుతుందని అంచనా వేశారు.