డొమెస్టిక్ క్రికెట్‌లో డోప్‌టెస్ట్‌లు
లా¬ర్,డిసెంబర్ 1: క్రికెట్‌లో డ్రగ్స్ స్కాండిల్స్ జరగకుండా ఉండేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ దేశవాళీ క్రికెట్‌లో కూడా డోప్ టెస్టులు ప్రవేశపెట్టింది. ప్రతీ డొమెస్టిక్ టోర్నమెంట్‌లోనూ దీనిని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుండి ప్రారంభం కానున్న నేషనల్ టీ ట్వంటీ ఛాంపియన్‌షిప్‌తో ఇవి అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం టోర్నీకి ముందు ప్రతీ ఆటగాడికీ డోప్ టెస్టులు నిర్వహించనున్నారు. నేషనల్ టీ ట్వంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న 14 జట్ల ఆటగాళ్ల నుండి శాంపిల్స్ సేకరిస్తున్నట్టు పిసిబి తెలిపింది. పిసిబీ నిర్ణయం వెనుక చాలా పరిణామాలు ఉన్నాయి. సరిగ్గా ఆరేళ్ళ క్రితం భారత్ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్ , మహ్మద్ ఆసిఫ్ నిషేధిత ఉత్పేర్రకాలు వాడి దొరికిపోయారు. దీంతో కిందిస్థాయి నుండే డొపింగ్ దొంగలను అరికట్టాలని పిసిబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు 2010లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు భట్ , అసిఫ్ , అవిూర్ నిషేధంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. దీంతో ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు వెంటనే తమ డొమెస్టిక్ క్రికెట్‌లో కొత్త యాంటీ కరప్షన్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. దీనికి తగ్గట్టుగానే డోప్ టెస్టుల్లోనూ తామే ముందడుగు వేశామని పిసిబీ వ్యాఖ్యానించింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిబంధనలకు అనుగుణంగానే ఈ టెస్టులు ఉంటాయని తెలిపింది. అలాగే తెలియకుండా నిషేధిత ఉత్పేర్రకాల జాబితాలో డ్రగ్స్‌ను క్రికెటర్లు తీసుకోకుండా ఉండేందుకు వారిని చైతన్యవంతులను చేయనున్నట్టు వెల్లడించింది. రానున్న కాలంలో పాకిస్థాన్ క్రికెట్ మరింత నిజాయితీగా ఉంటుందన్న ధీమాను పిసిబీ వ్యక్తం చేసింది.