డోర్నకల్ మాజీ సర్పంచ్ లావణ్య బీఆర్ఎస్ కు రాజీనామా -అనుచరులతో కాంగ్రెస్ గూటికి లావణ్య శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్24(జనంసాక్షి)

డోర్నకల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే సొంత డబ్బులతో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన నిధులు ఆపి ఇబ్బందులకు గురి చేస్తుంటే అధికారుల చుట్టూ తిరిగినప్పటికి నాయకుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికి అభివృద్ధి నిధులు ఇవ్వకుండా అట్టి సమస్యలపై కోర్టు చుట్టూ తిరుగుతూ మళ్ళీ డబ్బులు ఖర్చు చేస్తూ మానసికంగా, ఆర్థికంగా భారత రాష్ట్ర సమితి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పెట్టె ఇబ్బందులు తాళలేక స్వచ్చందంగా తమ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మాజీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు. డోర్నకల్ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరించే విషయంలో తన భర్త శ్రీనివాస్ పై హత్య యత్నానికి పాల్పడ్డారని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన సేవను గుర్తించకపోగా ఇబ్బందులు పెట్టడాన్ని సహించబోమని కాంగ్రెస్ పార్టీతో ప్రశ్నిస్తూ ప్రజలదీవెనతో రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజాసేవ చేయాలని వారి అనుచరులతో చర్చించి పార్టీ మారినట్టు తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ పేరుకు నియోజకవర్గ కేంద్రమైన డోర్నకల్ లో కానీ, డోర్నకల్ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ అభివృద్ధి కి నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డోర్నకల్ లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు, నిరుద్యోగులకు ఉపాధికై ఇండ్రస్టీలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని, అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ ఆరు గ్యారెంటిలను ప్రతీ ఇంటికి చేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. వారితో పాటుగా సీనియర్ నాయకులు మద శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పాకా వాసు, మాజీ ఎంపీపీ మేకపోతుల శ్రీను, మాజీ కో ఆప్షన్ సభ్యుడు వాజిద్, గొల్లచర్ల ఎంపీటీసీ శ్రీనివాస్, కాలా సుశీల్ కుమార్ జైన్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నేతలు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.