డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహిళా డాక్టర్
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మహిళా డాక్టర్ జూబ్లీహిల్స్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. పోలీసులు కారును ఆపివేసిన వెంటనే మద్యం మత్తులో ఉన్న మహిళా డాక్టర్ కోపంతో నడిరోడ్డుపై కారును వదిలేసి వెళ్లిపోయింది. దాదాపు కిలో మీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లిన ఆమెను పోలీసులు ఆపడంతో వాగ్వాదానికి దిగింది. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నానా రభస సృష్టించింది. ఆమెకు డ్రంక్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించే సరికి పోలీసులకు ఆయాసం వచ్చినంత పనైంది. చివరకు 32 శాతం మద్యం సేవించనట్టు నిర్ధారణ అవడంతో మహిళా డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. మొత్తం మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.