డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1748 మందికి జైలు
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఈ ఏడాది 11760 కేసులు నమోదవ్వగా, రూ. 1.26,62,760 జరిమానాలు వసూళ్లు కాగా 1748 మందికి జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ తెలిపారు. అక్టోబర్ ఫస్ట్ నుంచి పగటి పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రారంభించి 154 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ డ్రైవ్‌లో 22 మంది మహిళలు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. వాహనాల వారీగా నమోదైన కేసుల వివరాలివి.ద్విచక్రవాహనాలు 8551మూడు చక్రాల వాహనాలు 451,నాలుగు చక్రాల వాహనాలు 2251, ఇతర వాహనాలు 507 ఉన్నాయి.