డ్రా దిశగా మొహాలీ టెస్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 75/3
మరో 16 పరుగుల దూరంలో ‘ఆసీస్’
భువనేశ్వర్‌కు 3 వికెట్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 499/10 ఆసీస్
తొలి ఇన్నింగ్స్ 408/10
మొహాలీ, మార్చి 17 (జనంసాక్షి) : రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ జట్టు..21 ఓవర్లకు గాను 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. హ్యూస్ 53 పరుగులతోను, లియాన్ 4పరుగులతోను ఆడుతున్నారు. ఇదిలాఉండగా భువనేశ్వర్‌కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. 8 ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత జట్టు స్కోరుకు చేరుకోవాలంటే ఆసీస్‌జట్టు మరో 16 పరుగులు సాధించాల్సి ఉంది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో.. 499/10
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగులు చేసింది. ఆసీస్ జట్టు కంటే 91 పరుగుల ఆధిక్యతతో భారత జట్టు కొనసాగుతోంది. మూడో టెస్టులో మూడో రోజైన ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు భారత జట్టు 132.1 ఓవర్లకు గాను 10 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆట వర్షార్పణం అయిన విషయం.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 408/10 సాధించిన విషయం తెలిసిందే.
భారత స్కోరు ఇలా..
మురళీ విజయ్ 153, ధావన్ 187, పూజారా 1, సచిన్ 37, ధోని 4, జడేజా 8, అశ్విన్ 4, భువనేశ్వర్ కుమార్ 18, ఓజా 1 పరుగు వద్ద అవుటయ్యారు. ఇషాంత్‌శర్మ డకౌటయ్యారు. విరాట్ కోహ్లి 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
వికెట్ల పతనం ఇలా..
ఆసీస్ జట్టుకు చెందిన బౌలర్లలో సిడిల్ ఒక్కడే 5 వికెట్లు సాధించాడు. 29.1 ఓవర్లు బౌలింగ్ చేసి 71 పరుగులిచ్చి 5 వికెట్లను తీసుకున్నాడు. స్టార్క్ 23 ఓవర్లు వేసి 74 పరుగులిచ్చి 2 వికెట్లను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. హెన్రిక్స్, లియాన్, స్మిత్ చెరో వికెట్‌ను తమ తమ ఖాతాల్లో వేసుకున్నారు. హెన్రిక్స్ 15 ఓవర్లు బౌలింగ్ చేసి 62 పరుగులివ్వగా.. లియాన్ 31 ఓవర్లు వేసి 124 పరుగులు ఇచ్చాడు. అలాగే డోహర్టి 24 ఓవర్లు బౌలింగ్ చేసి 87 పరుగులిచ్చాడు. స్మిత్ 10 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చాడు.