డ్రైనేజీ పైకప్పు కూలి పడిపోయిన ఎంపీ
– గాయాలతో బయటపడిన పూనం
జామ్‌నగర్,మే16(జనంసాక్షి): గుజరాత్ జామ్‌నగర్ భాజపా ఎంపీ పూనమ్‌బెన్ మాదమ్ పెను ప్రమాదం నుంచి బయటపడింది. అనూహ్యంగా ఆమె డ్రైనేజీ కప్పుకూలడంతో అందులో దిగబడిపోయారు. తన నియోజకవర్గంలో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుండగా పరిశీలించడానికి వెళ్లిన గుజరాత్ జామ్‌నగర్ భాజపా ఎంపీ పూనమ్‌బెన్ మాదమ్ అనూహ్యంగా ప్రమాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలోని మురికివాడను సందర్శించి అధికారులతో మాట్లాడుతున్నారు. డ్రైనేజీపైన వేసిన స్లాబ్‌పై నిలబడి మాట్లాడుతుండగా ఒక్కసారిగా అది కూలిపోయి ఎంపీ సహా పలువురు పది అడుగుల లోతులో ఉన్న డ్రైనేజీలో పడిపోయారు. అక్కడున్న వారు వేగంగా స్పందించి ఎంపీని బయటకు తీశారు. గాయాలపాలైన ఎంపీని పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు మహిళలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మురికివాడలో కూల్చివేతలను ఆపాలని స్థానికులు కోరడంతో పూనమ్ అక్కడికి పరిశీలనకు వెళ్లారు.ఆమె స్థానికంగా జాలారామ్‌నగర్‌లో ఉన్న డ్రైనేజీలో జారిపడ్డారు. ఆమె ఓ మోరీపై నిలుచుని మాట్లాడుతున్న సమయంలో దాని పైకప్పు కుప్పకూలింది. దాంతో ఎంపీ పూనమ్ ఆ డ్రైనేజీలో పడిపోయారు. ఆ నాలా సుమారు 8 ఫీట్ల లోతు ఉంది. ఆమె కుడి కాలికి తీవ్రంగా గాయం అయ్యింది. వైద్య చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. డ్రైనేజీ చుట్టు ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు జామ్‌నగర్ మున్సిపాలిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చిన ఎంపీ అక్కడున్న డ్రైనేజీపై నిలబడి మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా నాలా పట్టీ కూలిపోయింది.