డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే కాస్త కష్టమే!

హైదరాబాద్‌: గుజరాత్‌ రాష్ట్రంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇక నుంచి కాస్త కష్టమే. ఎందుకంటే అక్కడి ఆర్టీఓ సెన్సార్లతో పనిచేసే ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్టును దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రావాణా శాఖ మంత్రి విజయ్‌ రుపానీ వెల్లడించారు. ఆ పరీక్షలో అభ్యర్థి డ్రైవింగ్‌ సరిగ్గానే ఉందని సెన్సార్లు గుర్తించి పాస్‌ చేస్తేనే లైసెన్సు దొరుకుతుంది. లేదంటే అంతే సంగతులు. ఈ పద్ధతిని అన్ని ప్రముఖ నగరాల్లోనూ తొలుత ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. తరువాత ఇతర ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేయనున్నారు.