ఢల్లీిలో తెలంగాణ తర్జన బర్జన

మాట తప్పితే ఎలా
సమయమాసన్నమైంది : సోనియా
అడ్డుపుల్ల వేస్తున్న ఆంధ్ర నేతలు
హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) :
తెలంగాణ అంశంపై ఢల్లీిలో తర్జన బర్జన కొనసాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు నానుస్తూ వచ్చిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఏదో ఒకటి తేల్చేస్తేనే పరిస్థితులు అనుకూలంగా మారుతాయని ఆలోచనలో పడిరది. ఇందుకోసం ఇప్పటికే రాష్టాన్రికి చెందిన తెలంగాణ నేతలను ఢీల్లీకి పిలిపించుకుని చర్చల జరుపుతోంది. ఈక్రమంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చేయాలనే ఆలోచనలో సోనియాగాంధీ ఖరాఖండిగా చెప్పినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను ఇచ్చేయాలనే ప్రతిపాదన తొలిది కాగా, రాయలతెలంగాణ కూడా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అనంతపూర్‌, కర్నూలు జిల్లాలను కలుపుకుని తెలంగాణ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఆలోచిస్తోంది. మూడోది రాష్ట్ర నాయకత్వం మార్పులు చేయాలనే భావనతో ఉన్నట్లు సమాచారం. అయితే మూడో ప్రతిపాదనపైన ఏ ఒక్కరిని సంతృప్తి పరచలేమనే ఆలోచనలో ఉన్న హైకమాండ్‌ కచ్చితంగా తెలంగాణ ఇవ్వాలా లేక, రాయల తెలంగాణ ఇవ్వాలా అనే రెండిరటిపైనే రాష్ట్రనేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఇచ్చేయాలనే ఉద్దేశ్యంతో ఉండడం వల్లే ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు కాకుండా సీమాంధ్రకు రెండు మంత్రి పదవులిచ్చి ఆ ప్రాంత నేలతను సముదాయించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఒకదెబ్బకు మూడు పిట్టలు కొట్టాలనే ఆలోచనతో కూడా హైకమాండ్‌ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఇచ్చేసి క్రెడిట్‌ను కొట్టేయాలనే భావనతో ఉన్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడ్డాక రెండు ప్రాంతాల్లో ఏర్పడే ప్రభుత్వాలకు కాంగ్రెస్‌ అధికారంలో ఉండే అవకాశాలున్నట్లు లెక్కలు తేలుస్తున్నాయి. తెలంగాణలోని 119 స్థానాలలో కాంగ్రెస్‌కు 49 మంది ఎమ్మెల్యేలుండగా, టీడీపీకి 31, టీఆర్‌ఎస్‌ 17, బీజేపీకి నాలుగు, ఎంఐఎంకు 7, సీపీఐకి నాలుగు, సీపీఎం, లోక్‌సత్తాలకు ఒక్కో ఎమ్మెల్యేలున్నారు. తెలంగాణను ఉన్నది ఉన్నట్లుగా ఇస్తే అటు టీడీపీని, ఇటు టీఆర్‌ఎస్‌ను, మరోవైపు వైసీపీని దెబ్బకొట్టాలని అధిష్టానం యోచిస్తోంది. టీడీపీని ఎలాగూ రెండు ప్రాంతాల్లో దెబ్బతీయొచ్చనే ఆలోచన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలాగూ ఇస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో విస్తృతం చేస్తుండడంతో కాంగ్రెస్‌కు ఒకింత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు సైతం తెప్పించుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఎన్నికలకు ముందే రాష్టాన్న్రి ఇచ్చేసి రెండు ప్రాంతాల్లో అధికారాన్ని నిలుపుకుని రాబోయే ఎన్నికల్లో పాగా వేసేందుకు వాడుకోవాలనే భావనతో ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లో నేడు వచ్చిన నాయకత్వ సమస్యతో టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెస్‌, టీడీపీ నేతలు చాలామంది కాంగ్రెస్‌లోకి చేరిపోవడం ఖాయమనే సమాచారం కూడా కేంద్రం వద్ద ఉందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సహకారం లేకుండా అధికారంలోకి రావాలంటే మరో ప్రత్యామ్నాయమైన రాయల తెలంగాణతో చెక్‌ పెట్టేందుకు కూడా ఆలోచనలో ఉంది. ఆంధ్రాకు ప్యాకేజీని ప్రకటించి అభివృద్ధికి పాటుపడాలని, ఈ పనిని కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్వహించాలనే తపనతో ఉన్నట్లు సమాచారం. తెలుగువారికి రెండు రాష్ట్రాలుండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవనే పరిస్థితులను కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎంఐఎం కూడా మద్దతిచ్చే అవకాశాలున్నాయి. దీనికి ఏడో నంబర్‌ జాతీయ రహదారిని బేస్‌గా కూడా చూపించే అవకాశాలున్నాయి. తెలంగాణ విభజన తర్వాత సీమాంధ్రలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉండే అవకాశాలను బేరీజు వేస్తున్నారు. కాంగ్రెస్‌కు అక్కడ 97, టీడీపీకి 44, వైఎస్సార్‌సిపికి 17, ఇతరులకు 17 ఎమ్మెల్యేలున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపిని సైతం దెబ్బతీయొచ్చనే భావనతోనే హైకమాండ్‌ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అటు సీమాంధ్ర నేతలను ట్యూన్‌ చేస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దిశగానే సంకేతాలు వస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా సీమాంధ్రకు చెందిన నేతలు రఘువీరారెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డిలతోపాటు ప్రముఖులు కూడా వారి వారి వైఖరిని మార్చుకుని అధిష్టాన ఏం చెపితే అదే అనే భావనను వ్యక్తం చేయడమనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఏవిధమైన లాభం జరుగుతుందనే టిజెఎసి నేతలను ఒకరిద్దరితోను, ప్రజాసంఘాల నేతలిద్దరితోను కూడా హైకమాండ్‌ పెద్దలు పిలిపించుకుని చర్చలు జరిపింది. దీనివల్ల కాంగ్రెస్‌కు స్పష్టమైన హామీ కూడా వారినుంచి లభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వడం వల్ల టీ జేఏసీ పూర్తిగా కాంగ్రెస్‌వైపునే నిలిచే అవకాశాలున్నట్లు హామీ తీసుకుంది. అలాగే ప్రజాసంఘాల నేతలను సైతం సంప్రతించగా బడుగు బలహీనవర్గాల తెలంగాణా కావాలనే భావనను వ్యక్తం చేయడంతో పాటు టీఆర్‌ఎస్‌కు గట్టిగా గుణపాఠం చెప్పేఅవకాశాలున్నాయనే విషయాన్ని తెలుసుకుంది హైకమాండ్‌. దీంతో తక్షణమే తెలంగాణపై తేల్చిపారేసి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేయించి పంపిస్తే ఆఘమేఘాలమీద నిర్ణయం తీసుకుని రెండుగా విడగొట్టేందుకే ప్రాదాన్యత నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను, జానారెడ్డిని పిలిపించి మాట్లాడిన హైకమాండ్‌ మరికొంత మందిని కూడా పిలిపించుకును ఢల్లీిలోనే ఉంచుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం తెలంగాణను వ్యతిరేకించిన హైదరాబాద్‌ బ్రదర్స్‌లో ముఖ్యుడైన దానం నాగేందర్‌తో చర్చలు జరిపి ఆయనచేత జై తెలంగాణ అనిపించిందని సమాచారం. ఈమేరకు తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డికె అరుణ తదితరులను పిలిపించుకుంది. వీరిని మాత్రం అక్కడే మకాం వేయాలని చెప్పడంతోనే వారు బస చేశారనే సమాచారం తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకే ఇటీవలే పార్టీ మారిన సీనియర్‌నేత కేకే, నాగర్‌కర్నూలు ఎంపి మందా జగన్నాథంలను కూడా సంప్రదించి వారితో పాటు మరికొంత మంది సీనియర్లను పార్టీలోకి తెచ్చి టీఆర్‌ఎస్‌ను దెబ్బగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయం అనే భావన తెలుస్తోంది. హైకమాండ్‌ ప్రధానంగా సోనియాగాంధీ హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇచ్చేసేందుకు సుముఖంగా ఉండడంతో ఆపనిని చేసి సీమాంధ్రలో నేతలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి, పిసిసి అధినేతలను సైతం పిలిపించి సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఇలా చేస్తే తప్ప రాబోయే ఎన్నికల్లో రెండుప్రాంతాల్లో అధికారం రావడమేకాక, కేంద్రంలో ఎంపిలను సైతం ఎక్కువగా పెంచుకునేందుకు  అవకాశాలున్నాయని గట్టి నివేదికలు హైకమాండ్‌ ముందు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈదిశగా అడుగులు వేస్తుందని తెలియడంతో ఒకరిద్దరు సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నా వారిని కట్టడిచేసేందుకు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడికి బాధ్యతను అప్పగించనున్నారు. అయితే సోనియా తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకోకుండా అధిష్టానం పెద్దలా ద్వారా ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఆంధ్ర నేతలు ముమ్మరం చేశారు.