ఢల్లీి అత్యాచార సంఘటన,నిరసనలు

(ఆదివారం తరువాయి భాగం)
జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సులు
జిస్టిస్‌ వర్మ కమిటీకి వెళ్లిన వేల కొద్ది విజ్ఞాపన పత్రాలలో, వికలాంగ మహిళా సంస్థలు, దళిత మహిళా సంఘాలు, సెక్స్‌ వర్కర్లు సంఘాలతో సహా అనేకమంది పంపించినవి ఉన్నాయి. తాము హింసనెదుర్కొన్న సందర్భాల్లో చట్టవ్యవస్థలతో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించి, వాటిని తొలగించడానికి అవసరమయిన పాలనా సంస్కరణలు చేపట్టాలని కోరాయి.
ఈ నివేదిక స్త్రీలపై ఆంక్షలు విధించడం, లేదా ఉరిశిక్ష వంటి కఠినశిక్షలు అమలు చేస్తే అత్యాచారాలు తగ్గుతాయనే వాదనలకు విరుద్దమయిన అభిప్రాయాలను వెలిబుచ్చింది. మొదటగా, పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు దేశంలో కొనసాగుతున్న పితృస్వామ్య ఆధిపత్యం, స్త్రీ పురుష అసమానతల నేపథ్యంలో జరుగుతున్నాయని చెప్పింది. రెండు, లింగ వివిక్ష లేని పరిపాలన అందించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని ప్రభుత్వాలు మరవడమే దీనికి కారణమంది. మూడవది, భారత స్త్రీలు తమపై జరిగిన హింస, వేధింపుల గురించి బయట చెప్పుకోడానకి సిగ్గుపడతారనే వాదనను తొసిపుచ్చింది. పోలీసు స్టేషన్లలో, న్యాయస్ధానాల్లో బాధితులను అవమానించడమే దీనికి కారణం తప్ప, భారతీయతకు, స్త్రీత్వానికి సంబంధించిన కారనాలేవీ లేవన్నది. సానుకూల పరిస్థితులు కల్పిస్తే మరిత మంది స్త్రీలు తమకు జరిగిన అన్యాయాన్ని బయట చెప్పుకుంటారంది. నాలుగు, అత్యాచారాలకి స్త్రీలు, బాలికలు మాత్రమే కాదు, బాలురు స్వలింగ సంపర్కలు కూడా గురవుతున్నారని గుర్తించింది. వీరందరికీ న్యాయం జరగాలంటే, ప్రపంచంలో అత్యంత ప్రగతిశీల చట్టాలను అమలు చేయాలని సూచించారు.
అత్యాచార నమోదునుపోలీసులు తిరస్కరిస్తే నేరంగా పరిగణించాలని, బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లో అయిన నమోదు చేసుకునే అవకాశం ఉండాలని చెప్పింది. అత్యాచార విచారణలో బాధితుల లైంగిక చరిత్ర గురించి, శీలం గురించి ప్రశ్నలు వెయ్యకూడదని ఎప్పటి నుండో మొత్తుకుంటున్న స్త్రీల సంఘాల ప్రతిపాదనను ఒప్పుకుంది. అత్యాచార నిర్థారణకు ప్రస్తుతం అమలులో ఉన్న ‘రెండు వేళ్ల’ పరీక్షను తొలగించాలని చెప్పంది. అత్యాచార నిర్వచనాన్ని విస్తృత పరిచింది. కేవలం పురషాంగం యోని లోపలికి వెళ్లడం’ మాత్రమే అత్యాచారమనే పితృస్వామ్య నిర్వచనాన్ని కాక, ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా ఎటువంటి లైంగిక క్రియను జరిపినా (నోటి ద్వారా, వస్తువు ద్వారా, చేతుల ద్వారా) అది అత్యాచారంగా పరిగణింప బడాలని సూచించింది.
ఇంతేకాదు, అత్యాచారాల నిరోధానికి ఉరిశిక్షలు పనికిరావనీ, అంతకంటే ముఖ్యంగా ప్రతి నిరుపించబడ్డ అత్యాచారంలో తప్పనిసరిగా శిక్ష పడడమే ముఖ్యమని చెప్పింది. వీటిని నిరోధించడానికి వీధి దీపాలు వెలగడం, ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం అవసరమంది. అంతేకాదు, తోపుడబండ్ల వాళ్లు ఉండడం కూడా అత్యాచార నిరోధానికి ఉపయోగపడుతాయంది.
వర్మ కమిటీ సిఫార్సులను భారత పార్లమెంట్‌ మార్చి 19న ప్రవేశ పెట్టిన చట్టంలో చోటు కల్పించింది. భర్తలు భార్యలపై జరిపే అత్యాచారాలను గుర్తించడం వంటి కొన్నిటిని మినహాయించింది. అయితే ఇవి మన సమాజంలో పనిచేయాలంటే కొనసాగుతున్న  బ్రాహ్మణీయ పితృస్వామ్య విలువలని ప్రశ్నించే, స్త్రీ`పురుష సమానత్వాన్ని వివిధ రకాల అసమానతల నేపథ్యంలో అర్థం చేయించాల్సిన అవసరం ఉంది.
ఆధునిక సమాజంలో కొసాగుతున్న బ్రాహ్మణీయ పితృస్వాయ్య విలువలు
స్త్రీలు ఒద్దికగా ఉండాలి, బయట తిరిగితే చెడిపోతారు, బయట పనిచేసే స్త్రీలు శీలవంతులు కారు అనే బ్రాహ్మనీయ పితృస్వామ్య భావజాలం కొంతమేరకు మారినప్పటికీ, స్త్రీ పురుష సంబంధాల గురించి ఉదారవాద దృక్పధం మన సమాజంలో రాలేదు. అమ్మాయిలకి చదువుకునే స్వేచ్ఛ, ఉద్యోగంలో చేరే స్వేచ్ఛ వచ్చాయి కాని, అవి రెండూ కూడా కుటుంబానికి సేవ చేయడం కోసం, పిల్లలకి చదువు చెప్పడం కోసమే వినియోగించాలి. యూనివర్సిటీల్లో పనిచేసే ప్రోఫెసర్లు కూడాఇ చాలామంది తమ నెల జీతం భర్తల చేతిలో పెట్టవలసిన స్థితిలోనే ఉన్నారు. కుటంఉబÊం క్సోం త్యాగాలు చేయని స్త్రీలను ‘స్వార్థపరులు, దుర్మార్గులు, కుటుంబమంటే ప్రేమ లేని వారిగా’ చిత్రీకరించడం చాల మామూలు. ఈ కట్టడులు భరించలేపోయినా, వాటిని ధిక్కరిస్తే చదువు, ఉద్యోగం కొనసాగించే పరిస్థితులు లేకపోవడం వల్ల ఎంతో కొంత భయం, ఒప్పుకోలు, లొంగుబాటు ధోరణులతో అనేక మంది స్త్రీలు రోజువారి జీవితం గడుపుతున్నారు.
ఈ పరిస్థితులు గ్రామాలకి, కుటుంబాలకి పరిమితం కాలేదు. ఆధునిక అధికార సంబంధాల్లో ఉండే పురుషులు తమ కింద పనిచేసే బాలికలనూ, బాలురనూ, స్త్రీలనూ, హాస్టల్‌ వార్డెన్లు, దళిత పిల్లలనిÑ ఫ్యాక్టరీ మేనేజర్‌ వర్కర్లనీÑ  డాక్టర్లు నర్సులనీ, వివాహ సంబంధాల్లో భర్త భార్యను, బాయ్‌ ఫ్రెండ్‌  తన గర్ల్‌ ఫ్రెండ్‌ను తమ ఆస్తిగానే భావించే సందర్బాలు ఎన్నో అనేక ఇంజనీరింగ్‌ కాలేజీల్లో, మెడికల్‌ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ‘తమ, తమ’ అమ్మాయిలను, ఆయా కులాలకీ, సమూహాలకి చెందిన అచ్చాయిలు, సంఘాలవారు కూడా కట్టడి చేయడం చాల మామూలు విషయం. ఇవన్నీ కూడా ప్రేమ, ఇష్టం పేరుతో చలామణి అవుతున్నాయి. స్వంత వ్యక్తిత్వంతో స్త్రీలు ఎదగాలంటే ఇటు వంటి ప్రేమను, ఇష్టాన్ని వాటిని ఓసించే సంస్కృతిని ధిక్కరించాల్సిందే.
ఇష్టం, బలవంతం ఇంతగా కలిసి ఉన్న మన సంస్కృతిలో బలవంతం చేయడానికీ, అత్యాచారానికీ, వేధింపులకీ, పరస్పర అంగీకారయుత ప్రేమకీ, స్నేహానికి, శృంగారానికి, తేడాలు ఉంటాయనేది ప్రస్తుతం చాలామందికి అర్థమవ్వని విషయం. మీడియా చర్చల్లో చాలామంది ప్రతిపాదించినట్లు లైంగికత ప్రకృతికీ, మనుషుల సహజ ప్రవృత్తికీ, లేదా వారి సైకాలజీకి సంబంధించిన సమస్య కాదు. స్త్రీతత్వమూ , పురుషత్వమూ మధ్య ఉనÊ అనేక రకాల జండర్లు కూడా సామాజికంగా రూపొందినవే. స్త్రీల మధ్య, పరుషుల మధ్య ఇద్దరి మధ్య సంబంధాలు ఒక రాజకీయ`సామాజిక విషయంగా అర్థం చేసుకున్నప్పుడు వాటి ప్రాతిపదిక కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన విషయంగా చేసుకోవాల్సి వస్తుంది.సమానత్వం, పరస్పర గౌరవం పరలింగ సంపర్కమయినా, స్వలింగ సంపకర్కమయినా, భార్య భర్తలయినా, పెళ్లికి ముందు సంబంధమయినా శృంగరం లేదా లైంగిక సంబంధం అంటే ` అది స్వేచ్చగా, స్వచ్ఛందంగా, పరస్పర అంగీకారంతో జరిగినప్పుడు మాత్రమే సరయినవీ, మంచివీ అనే విలువ, అవగాహన సమాజపరంగా రావడానికి మనమేం చేయగలం? ఇది చట్టపరంగా ప్రభుత్వ పరంగాచేయవలసని పనుల కంటే ముఖ్యమైనది. సమాజంలో అనేక సంస్థలు ఈమ బాధ్యతగా చేయవలసింది. విద్యాసంస్థలూ, కుల సంఘాలూ, విద్యార్ధి సంఘాలు, స్త్రీల సంఘాలు దీని గురించి తమ తమ కార్యరంగాల్లో నిర్ధిష్టంగా ఏమి చేయాలో ఈ సందర్బంగా చర్చించడం చాలా అవసరం.
ఇటువంటి కట్టడులను ధిక్కరించడానికి స్త్రీలకూ, పురుషులకూ కూడా సరయినంత సంస్థాగత సహకారం చాల స్థాయిల్లో దొరకట్లేదు. సంస్థాగత చర్యలు లేకుండా ఆధునిక విలువలూ, ఉదారవాద విలువలూ వాటంతట అవే రావు. స్త్రీల సాధికారత అంటే స్త్రీలు (వారికి సహకరించే పురుషులు) అన్ని రకాల అవరోధాలను వ్యక్తిగతంగా ఎదుర్కోవడం కాదు. ప్రభుత్వంతో పాటు అన్ని రకాల సంస్థలు కొన్ని చర్యలు చేపట్టడం అత్యంత అవసరం. కాలేజీలు, మీడియా సంస్థలు , కార్పొరేట్‌ సంస్థలు, యూనివర్సిటీలు, అన్ని రకాల ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వేతవ సంస్థలు ప్రభుత్వం నడిపించే స్వచ్ఛంద సంస్థలూ, హోటళ్లు అన్ని కూడా జండర్‌ సమానత్వం కోసం పనిచేయాలి. తమతమ ఉద్యోగుల్లో స్త్రీ ఉద్యోగుల సంఖ్య తగినంత ఉండేటట్లు చూడాలి. లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలను పెట్టాలి. జండర్‌ సమానత్వం పట్ల తమకు నిబద్దత ఉందని చెప్పుకోవడానికి, సిసి టీవీ కెమెరాల కంటే ఇవి చాల ముఖ్యం.
వేరు వేరు అసమానతలతో కూడిన జండర్‌ చర్చ
అయితే జండర్‌ గురించిన చర్చ చాలా వరకు స్త్రీ పురుష సంబంధాలపై మాత్రమే సాగకూడదు. గత దశాబ్దంలో, వికలాంగ స్త్రీలు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌`జండర్‌ వ్యక్తులు, సెక్స్‌ వర్కర్లు బాలల హక్లు సంఘాలు అనేక మంది తమ తమ శరీరాలపై తమ హక్కును ప్రకటించుకుంటూ తమ హక్కుల ఉల్లంఘనకు పితృస్వామ్యానికి ఉన్న సంబందాన్ని విశదీకరిస్తూ వస్తున్నారు. జండర్‌ పట్ల అవగాహనను చాల విస్తృత పరిచార. స్త్రీలెదుర్కొనే వివక్షతో పాటు ఇతర అసమానతలతో కులం, వర్గం, సెక్సువల్‌ మైనారిటీలు మతపరమయిన మైనారిటీలు ఎదుర్కునే వివక్షలను కలిసి చర్చించినపుడే వివిధ అసమానతల మధ్య ఉండే సంబంధాలు అందరికీ అర్ధమయ్యే అవకాశాలున్నాయి. సాధారణంగా జండర్‌పై చర్చల్లో మగపిల్లలు పాల్గొనక పోవడానికి కారణం ఆ భావనను కేవలం స్త్రీత్వం పురుషత్వం అనే రెండిరటికి కుదించి చూడడం వల్ల చర్చ చాలా వరకు సంస్కృతని నిలబెట్టాలి వంటి విషయాలపై జరుగుతోంది. వివిధ రకాల అసమానతల్లో జండర్‌ను కూడా కలిసి చర్చించినపుడు అమ్మాయిలకీ, అబ్బాయిలకీ కూడా జండర్‌పై అవగాహన పెరిగే అవకాశం వుంటుంది. కాలేజీల్లో, విశ్వ విద్యాలయాల్లోకీ కుల వివక్ష మతపరమయి వివక్ష, పేదరికం అనుభవించిన విద్యార్ధులు, వివిధ రకాల లైంగిక అస్తిత్వాలతో అనేక మంది ప్రవేశిస్తున్న తరుణంలో జండర్‌ అవగాహనని ఈ రకంగా పరిచయం చయ్యడం చాలా ముఖ్యం.
జండర్‌ సమానత్వానిÊ సాధించడంలో స్త్రీలవై వేధింపులు ఆపడంలో ఢల్లీి అత్యాచార సంఘటన, దాని తరువాత పరిణామాలు మన దేశంలో సమాజంలో ఈ వ్యవస్థాగత, సంస్థాగత, సాంసృతిక మార్పుల అవసరాన్ని మరింత బలంగాముందుకు తెచ్చాయి. అయితే ఆయా మార్పుల కోసం శతాబ్దలుగా జరుగుతున్న పోరాటాలలో ఈ పరిణామాలు ఒ మజిలి మాత్రమే!

(రచయిత సీనియర్‌ ఫోలో, అన్వేషి)