ఢల్లీి అత్యాచార సంఘటన, నిరసనలు


(శుక్రవారం తరువాయి భాగం)
అప్పటి ఉద్యమం నడిచినప్పుడు  చట్టాల పనితీరు కొంత మారినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటిదాకా అత్యాచార చట్టాల పనితీరు అత్యంత బాధాకరంగా కొనసాగుతోంది. పోలీసులు, కోర్టులు ఇప్పటికీ అత్యాచారల బాధితులను హీనంగానే చూస్తున్నారు. విఫెన్సు న్యాయవాదులు బాధితులను అబద్దాల కోరు లుగా, వేశ్యలుగాను లేదా వేరే కారణాలతో అత్యాచార ఫిర్యాదు చేశారని నిరుపించడానికి ప్రయత్నిస్తున్నారు. వైద్య పరీక్షలు బాధిత స్త్రీల గాయాల గురించి కాక, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేస్తారు.  1970 స్త్రీల ఉద్యమాలు కొత్త చట్టాల కోసం అడిగితే, ఢల్లీి సంఘటన తరువాత వచ్చిన నిరసనలు అయా చట్టాలని పనిచేయించమని డిమాండ్‌ చేశాయి. ఆయా చట్టాలని పనిచేయకుండా ఆపుతున్న పరిపాలనా వ్యవస్ధల వైఫల్యాలని ఎత్తి చూపాయి. పనిచేసే చట్టాలు, పోలీసు వ్యవస్థ కావాలని అడుగుతు న్నాయి. జరిగిన హింస చెప్పుకోలేనిదిగా భావించిన పరిస్థితులు 1970ల నాటివయితే, తాము స్త్రీలమవడం వల్లే తమపై హింసను గుర్తించట్లేదు అని సమాన పౌరసత్వాన్ని అడుగుతున్నాయి ఈ నిరసనలు. అప్పుడు కొత్త చట్టాలకోసం అడిగితే, ఇప్పటి యువ ఉద్యమకారులు కొత్త పాలనా సంస్కృతిని అడుగుతున్నారు. 1970నాటి స్త్రీవాదం శీలం, స్త్రీత్వం, పితృస్వాయ్యం స్త్రీలపై మోపే భారమని, వాటి ప్రాధాన్యతని కుటుంబాలు, సమాజం, రాజ్యం పెంచి పోషిస్తాయనీ, దానిలో భాగంగానే స్త్రీలపై దాడులను కప్పిపెడుతాయని చెపుతూ, అటువంటి స్త్రీతత్వ భారాన్నుండి స్త్రీలు విడుదల కావాలని వాదించింది. 2012లో నిరసనలు చేసిన యువత రకరకాల కారణాల వళ్ల ఇటువంటి భావజాల భారా న్నుండి కొంతమేరకు విడుదలయిన వారు దానికి స్త్రీల ఉద్యమం కొంత కారణమయితే, ప్రభుత్వం చేపట్టిన స్త్రీల సాధికా రత వినాదాలు, కార్యక్రమాలు కూడా కొంత మేరకు కారణమని చెప్పుకోవచ్చు. 1990ల తరువాత ప్రభుత్వాలు స్త్రీవాదాన్ని పరిపాలనా సంస్కృతిలోభాగం చేసుకునే క్రమంలో స్త్రీల సాధికారత నినాదాన్ని బాగా ప్రచారం చేశాయి. స్త్రీలు అనÊఇన రంగాల్లో ముందుకు రావాలి అన్న  నినాదం, పాలనా రంగంలో స్త్రీలను భాగస్వాములనుచేసుకునే ప్రయత్నాలు  స్త్రీలకి తాము కూడా ప్రభుత్వ పాలనలో భాగమే అన్న భావనున నయానా భయానా కల్పించింది.  ఢల్లీి ప్రభావిత నిరసనలని స్త్రీవాద ఉద్యమాల (పాత వయినా, కొత్తవయినా) నుండి వేరు చేసే ఇంకొక ప్రధాన తేడా న్యాయం గురించిన అవగాహన, 2013లో కొత్త పాలనా సంస్కృతిని అడుగుతున్న వారిలో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వారున్నారు. వారిలో గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చి పట్టణాల్లో తమ ఆడపిల్లల్ని చదివిస్తున్న వాళ్లు ఉన్నారు. కరుడు గట్టిన అధికార దాహం, పాలనా వైఫల్యాలు, మధ్యతరగతి    విష యాల పట్ల రాజకీయ నిర్లిప్తతను వ్యతిరేకించిన హజరే ‘నిరసనల’ ద్వారా వీధుల్లోకి వచ్చిన మధ్యతరగతి ప్రజలూ ఉన్నా రు. అయితే వీరిలో అనేక మంది అత్యాచారాలు ఆపా లంటే సత్వర న్యాయం కావాలని, సత్వర న్యాయ మంఏ త్వరగా కఠిన శిక్షలు పడాలనే నమ్మకాలతో ఉన్నా రు. నిరసనల్లో నేరుగా పాల్గొ నని చాలామంది అబ్బా యిలూ, అమ్మాయిలూ కూ డా, ఇంటర్నెట్‌లో ఇటు వంటి అభిప్రాయాలు పంచు కున్నారు. హైదరాబాద్‌లో రాజకీయ పార్టీల నుండి, మస్లీం స్త్రీల సంఘాల వరకు ఇటువంటి నినాదాలతోనే అనేక నిరసనల్లో పాల్గొ న్నారు.   స్త్రీవాద సంఘాలు ఇటువంటి నమ్మకాలని, కఠిన సిద్దాం తాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. ఉరి శిక్షలు ఎప్పుడూ కూడా అత్యాచారాలని, లైంగిక దాడులని ఆపడానికి పనికిదావనీ, దానికి బదులు ప్రతి సంఘటనకు తప్పకుండ శిక్ష పడుతుందనే భయమే కొంతయినా అత్యాచారాలని ఆపడంలో పనికొస్తుందనీ వాదించాయి. ఢల్లీి సంఘటన తరువాత దేశమంతా ‘మరణ శిక్ష’ అనే పిచ్చిలో ఊగిపోతుంటే, స్త్రీవాద సంఘాలు దానికి వ్యతిరేకంగా పోరాడాయి.
మరయితే ఢల్లీి ప్రభావిత నిరసనల ప్రాముఖ్యతలేవి?
పట్టణాల్లో రోడ్లపై ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిర్భయ వంటీ స్త్రీలపై అపరిచితులు జరిపే దాడుల పట్ల వ్యక్తమయిన ఈ నిరసన, స్త్రీలపై వ్యవస్థీకృత హింస పట్ల , రాజ్యహింస పట్ల, కుల, మత పరమయిన హింస పట్ల ఎందుకు వ్యక్తం కాలేదనే ప్రశ్న నాతో సహా అనేక మంది రాజకీయ కార్యకర్తలని భాదించింది. అయితే ఢల్లీి వప్రభావంతో దేవవ్యాప్తంగా జరిగనగి నిరసనలు, యువ పౌరులు తమ కోసం తాము చేపట్టినా, సార్వజజనీన రాజ్యంగ విలువలు, పాలనా సంస్కృతిని మార్చడానికి సహకరించేవే. ప్రపంచీకరణ తరువాత మధ్య తరగతి యువతి తమ కోసం తామే బతికే వారుగా తయారయ్యారు. వారికి సమూహం అవసరం. సామూహిక ప్రయత్నాల ప్రాధాన్యత తెలియకుండా పోయిందని అనుకుంటూ వస్తున్నాం. తమన అభిప్రాయాలని ఈ నిరసనలు కొంతయినా మార్చాయి. ప్రపంచీకరణనేపథ్‌యంలో చిన్న, పెద్దఉద్యోగాల్లో చేరిన స్త్రీలందరూ లింగ వివక్ష లేదనో, తాము వివక్షకు గురికావడం లేదనో, గురవుతున్నామని చెప్పుకోవడం తమ వ్యత్తిత్వంపై మచ్చగానోఅనుకోవడం మామూలయిపోయింది. పట్టణాల్లో మధ్యతరగతి స్త్రీలు రోజువారీ జీవితంలో ఎదురయ్యే లైంగిక వేధింపులను ఎలాగో అల తప్పించుకున్నారు. ఈ నిరసనలు వారి నిర్లిప్తతను   బద్దలుకట్టి వారిని రోడ్లపైకి తీసుకువచ్చాయి. మధ్‌యతరగతికి చారిత్రకంగా లభించిన అధికారం, పాత్ర వల్ల మధ్యతరగతి స్త్రీలు రోడ్లపైకి రావడం జాతీయ మీడియా, ప్రభుత్వం సీదియస్‌గాతీసుకన్నాయి. సామాజికంగా, రాజకీయంగా స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, స్త్రీ పురుష అసమానతలూ, లైంగిక హింస మళ్లీ సమాజం ముందుకు రాజకీయ అజెండాలోకి వచ్యాయి. ఈ సందర్బం అనేక ఉద్యమాల్లో పని చేస్తున్న స్త్రీలకూ, స్త్రీ వాదులకు లైంగిక హింసకు సంబందించిన చట్టాలను మార్చాలని సుదీర్ఘంగా చేస్తున్న పోరాటాన్ని  ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పించింది. అపరిచితులు జరిపే అత్యాచారాలే కాక సైన్యం, పోలీసు బలగాలు, కుటుంబ సభ్యులు జరిపే దాడులను పరిగణన లోకి తీసుకోవాలని, స్త్రీలని, పిల్లలని లైంగిక దోపిడీ కోసం రవాణా చేయడాన్ని నేరపూరిత చర్యగా చేయాలనీ వాదించడానికి అవకాశం కల్పించింది. స్త్రీలపై బయల జరిగే హింసనే కాక బాధితులపై పోలీసు యంత్రాంగం, న్యాయస్దానాల సంస్కృతిని మార్చాలని అవరాన్ని చర్చించే అవకాశాన్ని  కల్పించింది. స్త్రీల భద్రత అనేది ఒక వ్యక్తిగత విషయంగానో లేదా మానవ ప్రవృత్తికి సంబందించిన అంశంగానో  కాక, పరిపాలనా సంస్కృతికిటవ సంబందించిన అంక్షంగా ముందుక తేవడానికి సహాయపడ్డాయి. జస్టిస్‌ వర్మ కమి టీ మంచి రిపోర్ట్‌ రాయడానికి తొడ్పడ్డాయి.
జస్టిస్‌ వర్మ సిఫార్సులు
జస్టిస్‌ వర్మ  కమిటీకి వెళ్ని వేల కొద్ది విజ్ఞాపన పత్రాలలో ,వికలాంగ మహిళా సంస్థలు దళిత సంఘాలు సెక్స్‌ వర్కర్ల సంఘాల తో సహా అనేక మంది పంపించినవి ఉన్నాయి.తాము  హింసనెదుర్కొన్న సందర్భల్లో ,చట్ట వ్యవస్థలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించి ,వాటిని తొలగించడానికి అవసరమైన పాలన సంస్కరణలు చేపట్టాలని కోరాయి.ఈ నివేదిక స్త్రీలపై ఆంక్షలు విధించడం ,లేదా ఉరిశిక్షలాంటి కఠిన శిక్షలు అమలు చేస్తే అత్యాచారాలు తగ్గుతాయనే వాదనలకు విరుద్దమయిన అభిప్రాయాలను వెల్లుబుచ్చింది.మొదటగా పెరుగుతున్న అత్యాచారాలు ,వేధింపులు దేశంలో కొనసాగుతున్న పితృస్వామ్య ఆధిపత్యం ,స్త్రీ పురుష అసమానతల నేపధ్యంలో జరుగున్నాయని చెప్పింది.రెండు లింగ వివక్షలేని పరిపాలన అందించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని ప్రభుత్వాలు మరువడమే దీనికి కారణమంది.మూడవది ,భారత స్త్రీలు తమపై జరిగిన హింస ,వేధింపుల గురించి బయట చెప్పుకోవడానికి సిగ్గుపడతారనే వాదనను తోసిపుచ్చింది.పోలీసు స్టేషన్లలో న్యాయస్థానాలలో భాధితులను అవమానించడమే దీనికి కారణం తప్ప భారతీయతకు ,స్త్రీతత్వానికి సంభంధించిన కారణాలేవి లేవన్నది సానుకూల పరిస్థితులు కల్పిస్తే మరింత మంది స్త్రీలు  తమకు జరిగిన అన్యాయాన్ని బయట  చెప్పుకుంటారంది.బాలురు స్వలింగ సంపర్కులు కూడా గురవుతున్నారని గుర్తించింది.వీరందరికి న్యాయం జరగాలంటే ప్రపంచంలో అత్యంత ప్రగతి శీల చట్టాలను అమలు చేయాలని సూచించింది. అత్యాచార నమోదును పోలీసులు తిరస్కరిస్తే నేరంగా పరిగణించాలని ,భాధితులు ఏ పోలీసు స్టేషన్లలో అయినా  నమోదు చేసుకునే అవకాశం ఉండాలని చెప్పింది.అత్యాచార విచారణలో భాధితుల లైంగిక చరిత్ర గురించి ,శీలం గురించి ప్రశ్నలు వేయ్యకూడదని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న స్త్రీల సంఘాల ప్రతిపాదననను ఒప్పుకుంది .అత్యాచార నిర్ధారణకు ప్రస్తుతం అమలులో ఉన్న రెండు వేళ్ల పరిక్షను తొలగించాలని చెప్పింది.అత్యాచార నిర్వచనాన్ని విస్త్రృత పరిచింది.కేవలం పురుషాంగం యోనిలోపలికి వెళ్లడం మాత్రమే అత్యాచారమనే పిత్రుస్వామ్య నిర్వచనాన్ని కాక ,ఒక వ్యక్తికి ఇష్టం లేకుండ ఎలాంటి లైంగిక క్రియ జరిపినా (నోటి ద్వారా, వస్తువు ద్వారా ,చేతి ద్వారా )అది అత్యాచారంగా పరిగణించబడాలి అని సూచించింది.
ఇంతే కాదు ,అత్యాచారాల నిరోదానికి ఉరిశిక్షలు పనికి  రావని ,అంతకంటే ముఖ్యంగా ప్రతి నిరూపించబడ్డ అత్యాచారంలో తప్పనిసరిగా శిక్షపడడమే ముఖ్యమని చెప్పింది.వీటిని నిరోదించడానికి వీధి దీపాలు వెలగడం ,ప్రజారవాణ సౌకర్యాలు మెరుగుపడడం అవసరమంది.అంతేకాదు ,తోపుడు బండ్లవారు ఉండడం కూడా అత్యాచార నిరోధానికి ఉపయోగపడతాయంది.
వర్మ కమిటీ సిఫార్సులను భారత పార్లమెంటు మార్చి 19న ప్రవేశ పెట్టిన చట్టంలో చోటు కల్పించింది.భర్తలు భార్యలపై జరిపై అత్యాచారాలను గుర్తించడం వంటి కొన్నింటిని మినహాయించింది.అయితే ఇవి మన సమాజంలో పనిచేయాంటే కొనసాగుతున్న బ్రహ్మణీయ పితృస్వామ్య విలువలని ప్రశ్నించి స్త్రీ `పురుష సమానత్వాన్ని వివిధ రకాల అసమానతల నేపధ్యంలో అర్థం చేయాల్సిన అవసరం ఉంది.
` డా.ఎ.సునిత
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….