ఢల్లీి అల్లర్ల కేసులో మరో ట్విస్ట్‌

 

న్యూఢల్లీి,ఆగస్ట్‌13(జనంసాక్షి): గత సంవత్సరం జూలై నెలలో రాజధాని ఢల్లీిలోని ఈశాన్య జిల్లాలో జరిగిన అల్లర్లలో అన్సార్‌ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇన్ఫార్మర్‌ నుండి సమాచారం అందుకున్న పోలీసులు అన్సార్‌ ఖాన్‌ ఢల్లీి అల్లర్ల సమయంలో బాంబులు తయారు చేసి అల్లర్లకు సహకరించాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం అన్సార్‌ ఖాన్‌ ఘజియాబాద్‌లో నివసిస్తున్నాడని, అతను ఇంకా బాంబులు తయారు చేస్తున్నాడని ఇన్‌ఫార్మర్‌ నుండి పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అన్సార్‌ ఖాన్‌ను ఢల్లీి పోలీసు ప్రత్యేక విభాగం అదుపులోకి తీసుకుంది. ఘజియాబాద్‌లోని అతని ఇంటిపై దాడులు నిర్వహించినప్పుడు అతని ఇంటి పైభాగంలో 5 పైపు బాంబులు కనుగొన్నారు. ఢల్లీి అల్లర్ల బాధ్యుడిగా ఉన్న అన్సార్‌ ఖాన్‌ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. అన్సార్‌ నుఇరికించానికే అతని పొరుగు వ్యక్తి 5 పైపు బాంబులను ఘజియాబాద్‌లోని తన ఇంటి పైకప్పుపై ఉంచినట్లు ఢల్లీి పోలీసు స్పెషల్‌ సెల్‌ విచారణలో వెల్లడైంది. ఈ విషయం బహిర్గతం అయిన తర్వాత ఢల్లీి పోలీసుల ఫిర్యాదుపై, ఘజియాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ముజమ్మిల్‌ అల్వీని అరెస్టు చేశారు. ఢల్లీి పోలీసు స్పెషల్‌ సెల్‌ ప్రకారం ముజమ్మిల్‌ అల్వి తన పొరుగున ఉన్న అన్సార్‌ ఖాన్‌ టెర్రస్‌ మీద 5 పైపు బాంబులు ఉంచడానికి కుట్ర పన్నాడు