ఢిల్లీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం

2

ఉచిత వైఫై, నీరు ప్రజల హక్కుగా గుర్తిస్తాం

మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్‌

న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): ఢిల్లీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆమ్‌ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఢిల్లీలో ప్రజలకు ఉచిత వైఫై అందుబాట్లోకు తెస్తామన్నారు. తమతో చర్చకు బీజేపీ నేత, మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ జంకుతున్నారని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. శనివారం న్యూఢిల్లీలో ఆప్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అనంతరం కేజ్రీవాల్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… కేంద్రమంత్రులంతా తమ పనులు మానేసి ఢిల్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేప్పారు. ఈ సారి సీఎం అయితే గతంలోని 49 రోజుల పాలన కంటే మరింత మెరుగైన పాలన అందిస్తానని ఆయన న్యూఢిల్లీ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు సగానికి సగం తగ్గిస్తామని హావిూ ఇచ్చారు. ఆడిత్‌ తర్వాత నిర్థిష్ట ఛార్జీ ఫిక్స్‌ చేస్తామన్నారు. ఆప్‌ను చూసి బీజేపీ

భయపడుతోందని విమర్శించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆప్‌ తన మేనిఫెస్టోలో 70 అంశాలతో కూడిన యాక్షన్‌ ప్లాన్‌తో విడుదల చేసింది.