ఢిల్లీలో ఆప్‌కు తిరుగులేదు

4

సంపూర్ణ మెజారిటీ దిశగా కేజ్రీవాల్‌

తాజా సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 7న జరగనున్న హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య ¬రా¬రీ పోరు జరిగే అవకాశముంది.  ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు

రోజురోజుకు మారుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు ఇటీవలి సర్వేల్లో తేలగా, తాజాగా ఆప్‌ అధికారానికి చేరువకానున్నట్టు వెల్లడించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఆప్‌ కన్వీనర్‌, తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు దక్కనున్నట్టు  సర్వేలు చెప్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ఆప్‌ మెజార్టీకి చేరువకాగా,

బీజేపీ కాస్త తేడాతో రెండో స్థానంలో ఉంది. ఇక కాంగ్రెస్‌ మూడో స్థానంతో వెనకబడింది. బీజేపీ చేయించిన అంతర్గత సర్వే ప్రకారం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ 36, బీజేపీ 32, కాంగ్రెస్‌ 2 సీట్లు దక్కనున్నట్టు సమాచారం. ఇక నీల్సన్‌ సర్వే ప్రకారం ఆప్‌కు 35, బీజేపీ 29, కాంగ్రెస్‌ 6, టీఎన్‌టీ సర్వే ప్రకారం ఆప్‌ 36-40, బీజేపీ

28-32, కాంగ్రెస్‌ 2-5 సీట్లు గెల్చుకోనున్నాయి.