ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ‘జానా’ బెత్త
మా మధ్య విభేదాలు లేవు : పొన్నాల
న్యూఢిల్లీ, అక్టోబర్ 19(జనంసాక్షి):రాష్ట్ర పంచాయితీ శాఖమంత్రి జానారెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జయ పాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంత మంత్రులంతా అధిషా ్టనం పెద్దలతో భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయించుకున్న విష యం తెలిసిందే. అయితే జానారెడ్డి మినహా శుక్రవారం రాత్రికి ఇంకా మంత్రు లు ఎవరూ ఢిల్లీకి చేరుకోక పోవడంతో వీరి పర్యటనపై అస్పష్టత నెలకొంది. జానారెడ్డి గురువారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం నాడు మరికొందరు మంత్రులు ఇక్కడికి వస్తారని భావించిన వారు రాలేదు. విమానం టిక్కెట్లు లభించకే రాలేదని చెబుతున్నారు. మరోవైపు మంత్రుల మధ్య విబేధాలు ఉండటం వల్లే అంతా కలిసి వెళ్ళలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఐటి శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో ఖండించారు. తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెప్పారు. తెలంగాణ కోసం మంత్రులంతా ప్రజాస్వామ్య పద్ధతిలో కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు కాకపోయిన రేపైనా మంత్రులంతా ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం పెద్దలను కలుస్తామని చెప్పారు. ఈ పర్యటనే తెలంగాణ కోసం జరిపే చివరి పర్యటనగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. బీసీ సంక్షేమ శాఖమంత్రి బసవరాజు సారయ్య శుక్రవారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారని తెలుస్తోంది. మరో మంత్రి శ్రీధర్‌బాబు శనివారం నాడు ఢిల్లీ బయలుదేరతారని చెబుతున్నారు. అయితే మహిళా మంత్రులతో పాటు మిగిలిన మంత్రులు ఢిల్లీ వెళ్ళడం అనుమానమేనని అంటున్నారు. జానారెడ్డి మాత్రం తనదైన శైలిలో అధిష్టానం పెద్దలను కలవడంలో చొరవతో ముందుకు కదులుతూ బిజీ బిజీగా ఉన్నారు.