ఢిల్లీలో నరసింహన్‌ బిజీబిజీ

1

రాష్ట్రపతి, రాజ్‌నాథ్‌లతో భేటీ

న్యూఢిల్లీ,జూన్‌10(ఆరన్‌ఎన్‌ఎ): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ బిజీగా ఉన్నారు. రాష్ట్రపతిని, ¬ంమంత్రిని కలిసి తాజా పరిస్థితులను వివరించినట్లు సమాచారం. అయితే గవర్నర్‌ వారితో ఏం వివరించారు. ఇక్కడి ఓటుకు నోటు వ్యవహారంలో ఏం చెప్పి ఉంటారన్నది ఇప్పుడు ఢిల్లీలో హాట్‌

టాపిక్‌గా మారింది. గవర్నర్‌ నివేదకిపైనే వ్వయహారమంతా ఆధారపడి ఉంటుంది. అందుకే గవర్నర్‌ నివేదికే కీలకం కాబోతోంది. హైదరాబాద్‌ లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలిఫోన్‌ టాపింగ్‌ జరగలేదని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది.  కేంద్ర ¬మ్‌ మంత్రి రాజ్‌ నాద్‌ సింగ్‌ గవర్నర్‌ కు ఫోన్‌ చేసి దీనిపై ప్రశ్నించారని, అప్పుడు ఆయన పోన్‌ టాపింగ్‌ జరగలేదని,కేవలం స్టీవెన్సన్‌ ఫోన్‌ కు చంద్రబాబు పోన్‌ చేసినప్పుడు అది రికార్డు అయిందని వివరించారని సమచారం .అయితే చంద్రబాబుపై ఎప్‌ ఐ ఆర్‌ నమోదు చేస్తే దర్యాప్తునకు తన అనుమతి అవసరం అవుతుందని, అందుకు కేంద్రం మార్గదర్శకం చేయాలని నరసింహన్‌ కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్‌ ఏం నివేదించారన్నది సస్పెన్స్‌గా ఉంది. ఇకపోతే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు అరెస్టు భయం పట్టుకుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.  ఈ వ్యవహారంలో బాబు, స్టీఫెన్‌సన్‌ ఫోన్‌ సంభాషణ ఆడియో టేపులు బహిర్గతమైన విషయం విదితమే. నాటి నుంచి చంద్రబాబు అరెస్టు భయంతో ఊగిపోతున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో లీగల్‌గా బాబు దొరికిపోయాక ఇక ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు చేర్చిన అనంతరం బాబు రాజీనామా చేయక తప్పదు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్‌ఐఆర్‌ నమోదు అయిన మరుక్షణమే బాబు సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో ఎన్డీటీవీతో మాట్లాడారు. తనకు తానే అరెస్టు ప్రస్తావన తెచ్చారు. తనను అరెస్టు చేసే ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తనను అరెస్టు చేస్తే తెలంగాణ సర్కార్‌కు అదే చివరి రోజు అవుతుందన్నారు. ఎన్టీటీవీతో బాబు మాట్లాడుతున్న సమయంలో ఆయన ముఖంలో అరెస్టు భయం స్పష్టంగా కనిపించింది. కేంద్ర మంత్రులను కలుస్తూనే బాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కొంత మంది కేంద్ర మంత్రులైతే ముఖం చాటేస్తున్నారు.