ఢిల్లీ గల్లీ ఆట


శ్రీ80 పరుగులకే చిత్తైన డేర్‌ డెవిల్స్‌

శ్రీఅన్నింటా విఫలమైన హస్తిన జట్టు

శ్రీహైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ చేతిలో ఘోర పరాభవం

శ్రీపాయింట్ల పట్టికలో మూడో స్థానానికి

ఎగబాకిన హైదరాబాద్‌

హైదరాబాద్‌ మే 4 (జనంసాక్షి) :

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుపై హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిిల్లీ జట్టు హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 80 పరుగులకే ఆలౌటయ్యింది. ఓపెనర్‌ బ్యాట్స్‌ మెన్‌ జయవర్ధనే 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇశాంత్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వీరెంద్ర సెహ్వాగ్‌ రెండంకెల స్కోర్‌ చేయలేకపోయాడు. 17 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి సమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన చంద్‌ కొద్ది సేపు నిలకడగా ఆడి 24 బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లెవరూ నిలక డగా ఆడలేక పోయారు. వార్నర్‌ 8, మెండిస్‌ 11, జాదవ్‌ 3, పటాన్‌ 13, బోతా 1, యాదవ్‌ (నాటౌట్‌) 2 పరుగులు చేశా రు. నదీం, నెహ్రా డకౌట్‌ అయ్యారు. 81 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.5 ఓవర్లలోనే గెలిచింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ పటేల్‌ 18 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. మెండిస్‌ బౌలింగ్‌లో జాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుది రిగాడు. ధావన్‌ 16 బంతుల్లో 22 పరుగులు చేసి బోతా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకు న్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆశిశ్‌రెడ్డి 6 బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేసి నెహ్రా బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. సమీ 20 బంతులు ఆడి 18 పరుగులు (నాటౌట్‌) చేయగా.. సంగక్కర 8, విహారీ 11 పరుగులు చేసి విజయాన్ని అందించారు. బౌలర్లలో బోతా 2, మెండిస్‌, నెహ్రా చెరో వికెట్‌ తీశారు. ఢిల్లీ జట్టులో స్టెయిన్‌, పెరెరా, సమీ తలో రెండు వికెట్లు తీశారు. ఇషాంత్‌, మిశ్రా, కరన్‌శర్మలకు తలో వికెట్‌ దక్కింది. డారెన్‌ సమీకి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది..స్కోర్‌ వివరాలు :

ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ బ్యాటింగ్‌ :

జయవర్థనె ఎల్బీడబ్య్లూ ఇషాంత్‌ శర్మ 11(4I1, 6I1), సేహ్వాగ్‌ (బి) సమ్మి 8, అన్ముక్‌ చాంద్‌ (బి) డేల్‌ స్టేయిన్‌ 17(4I3), వార్నర్‌ (స్టం) పార్థివ్‌ పటేల్‌ (బి) అమిత్‌ మిశ్రా 8, మెండీస్‌ (సి) ఇషాంత్‌ శర్మ (బి) సమ్మి 11, కేఆర్‌ జాదవ్‌ (సి)(బి) కరణ్‌ శర్మ 3, ఇర్ఫాన్‌ పఠాన్‌ (బి) డేల్‌ స్టేయిన్‌ 13, బోథా (సి)పార్థివ్‌ పటేల్‌ (బి) థిస్సరా ఫేరెరా 1, నదీం 0, తెజాశ్వి యాదవ్‌ నాటౌట్‌ 2, ఆషిష్‌ నెహ్రా (బి) థిస్సరా ఫేరెరా 0.

ఎక్సాట్రాలు : 6 ( బైస్‌-3, వైడులు-1, నోబాల్‌-1, లెగ్‌ బై-1, ఫెనాల్టీ -0)

మొత్తం : 80 (19.1 ఓవర్లకు 10 వికెట్లు)

వికెట్ల పతనం :  1-13(జయవర్థనె 3.4), 2-32(సెహ్వాగ్‌ 7.1), 3-50(  చాంద్‌ 10.5), 4-