ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌ వరాలు

1

నీళ్లు ఫ్రీ, కరెంటు చార్జీలు సగం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తూ దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల   ఇచ్చిన హావిూల మేరకు 400 యూనిట్ల వరకు 50 శాతం విద్యుత్‌ఛార్జీలను తగ్గించారు. ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేయనున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పదవిలోకి వచ్చాక విద్యుత్‌  బిల్లులు,నీటి సరఫరాపై దృష్టి పెట్టారు. ప్రజలకిచ్చిన హావిూమేరకు వీటిని తగ్గించాలని నిర్ణయించారు. సామాన్యుడి పార్టీ అధికారంలోకి రావడంతోనే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. దానికి తగ్గట్లుగా విద్యుత్‌ చార్జీలను ఏభై శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఇది 400 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే వినియోగదారులందరికి వర్తిస్తుంది.దీంతో డిల్లీలో తొంభై శాతం మంది ప్రజలకు విద్యుత్‌ భారం తగ్గుతుంది.అలాగే రోజుకు కుటుంబానికి 700 లీటర్ల నీటిని కూడా ప్రజలకు ఉచితంగా అందిస్తారు.మరి వీటన్నిటికి సంబందించి ప్రభుత్వం వద్ద ఎంత డబ్బు ఉంది, దీనిని ఎలా పూరిస్తారు?అన్నది తెలియవలసి ఉంది. మార్చి ఒకటి నుంచి ఈ నిర్ణయాలు అమలులోకి రాబోతన్నాయి.అన్ని రాష్టాల్రలో విద్యుత్‌ చార్జీలు పెంచుతుంటే ,ఢిల్లీలో తగ్గించడం విశేషమే.