ఢిల్లీ ప్రజలకు సేవచేసే అవకాశమివ్వండి
ప్రధాని నరేంద్రమోదీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి3(జనంసాక్షి): ఢిల్లీ ప్రజలు తమకు సేవ చేసే అవకాశం తనకివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశరాజధాని ల్లీ ప్రజల బాధలు తీర్చడమే గాకుండా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, ఇది తన బాధ్యతని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రోహిణి ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన దిల్లీ ప్రజలు చూపిన ఆదరణ మర్చిపోలేనని, అభివృద్ధి చేసిచూపుతానని హావిూ ఇచ్చారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దిల్లీ దుర్భరంగా మారిందని, దిల్లీ ప్రజల బాధ్యత తన భుజస్కంధాలపై ఉందని ప్రధాని అన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో తనపై అనేక ఆరోపణలు చేశారని, గుజరాత్ అవతల మోదీని ఎవరు గుర్తిస్తారని విమర్శించారని ఆయన గుర్తుచేశారు. రాజధాని కీర్తిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాల్సిన అవసరముందని, దిల్లీని అన్నిరకాలుగా అభివృద్ధి చేసిచూపుతామని ప్రధాని పేర్కొన్నారు. తమకు అధికారం అప్పగిస్తే అభివృద్ది చేసి చూపుతామన్నారు. ఇదిలావుంటే అంతర్జాతియ రెజ్లర్ గ్రేట్ కాళీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. జలందర్‌లో రెజ్లింగ్ స్కూల్ ఏర్పాటు కోసం అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన కాళీ.. యూఎస్ బీజేపీ సభ్యులతో కలిసి కొద్దిసేపు ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కిరణ్ బేదీ విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వాలని కాళీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు కాళీ కిరణ్ బేదీకి గుడ్ లక్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్టాల్రలో ఏర్పాటు చేయనున్న రెజ్లింగ్ స్కూళ్లకు కాళీ కొన్ని రోజులు శిక్షణనివ్వనున్నారు. ఇదిలావుంటే కేజ్రీవాల్ మరో వివాదానికి తెరలేపారు. ప్రజలు ఎవరికి ఓటు వేసినా అది భాజపా ఖాతాలో చేరిపోయేలా ఈవీఎంలను టాంపర్ చేశారంటూ ఆప్ అధినేత కేజీవ్రాల్ ఆరోపించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఈ నెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భాజపా ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల టాంపరింగ్‌కి పాల్పడుతోందని ఆరోపిస్తూ కేజీవ్రాల్ ఈ రోజు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో తాను ఈవీఎంలను తనిఖీ చేయగా నాలుగు మెషీన్లు టాంపర్ అయినట్లు గమనించానని కేజీవ్రాల్ పేర్కొన్నారు. మరోవైపు ఏబీపీ న్యూస్ ఛానల్ తాజా సర్వేలో దిల్లీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కేజీవ్రాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 35 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, భాజపా 29 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే చెప్పింది. నీల్సన్ సంస్థతో కలిసి ఏబీపీ న్యూస్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కేవలం 6 సీట్లు గెలవనుంది. శాసనసభలో మొత్తం 70 సీట్లున్నాయి. దిల్లీ ప్రజల్లో 48 శాతం మంది కేజీవ్రాల్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కిరణ్ బేడీకి 42 మంది మద్దతు లభించింది. ఆర్థికంగా పేదలు, బలహీనవర్గాల వారు, ము/-లసిముల్లో ఆప్ పట్టు సడల్లేదు.