ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణం

cover-story-14

డప్యూటీ సిఎంగా సిసోడియా సహా ఆరుగురు

పండగ వాతావరణం తలపించిన రాంలీలా మైదానం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(ఆర్‌ఎన్‌ఎ): ఢిల్లీ ముఖ్యమంత్రి గా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు.రామ్‌ లీల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కేజ్రీవాల్‌  తో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన తోపాటు ఏడుగురు కూడా మంత్రులు గా ప్రమాణస్వీకారం చేశారు. పెద్ద సంఖ్యలో జనం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏడాది తరవాత తిరిగి ఫఙబ్రవరి14ననే  రెండోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. కిందటిసారి నలభై తొమ్మిది రోజులు పదవిలో ఉండగా, ఈసారి ఐదేళ్లు పదవిలో ఉంటారన్న నినాదం పాంచ్‌ సాల్‌ సి.ఎమ్‌. అంటూ ప్రచారం చేశారు. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రమాణస్వీకారం చేశారు.  సీఎం కేజీవ్రాల్‌తో పాటు డిప్యూటీ సీఎంగా మనీష్‌ సిసోడియా, మంత్రులుగా అసీం అహ్మద్‌ఖాన్‌, సత్యేంద్రజైన్‌, సందీప్‌ కుమార్‌, గోపాల్‌ రాయ్‌ ప్రమాణస్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆప్‌ కార్యకర్తలు తరలివచ్చారు.  కేజ్రీవాల్‌ తరవాత ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ మనీశ్‌ సిసోడియాతో, ఇతర మంత్రులతో ప్రమాణం చేయించారు.

దిల్లీ అభవృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం: కేజీవ్రాల్‌

త్వరలోనే జన్‌లోక్‌పాల్‌ బిల్లును ఆమోదిస్తామని, దిల్లీ అభివృద్ధికోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం కేజీవ్రాల్‌ మాట్లాడుతూ… అవినీతి రహిత తొలి నగరంగా దిల్లీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గతంలో లాగే అవినీతిపై ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ కొనసాగిస్తామని తెలిపారు. దిల్లీలో వీఐపీ సంస్కృతిని మారుస్తాం, ప్రభుత్వ వాహనాలకు ఎర్రబుగ్గ ఉండదని వెల్లడించారు. దిల్లీ అభివృద్ధి కోసం కిరణ్‌బేడీ, అజయ్‌మాకెన్‌ లాంటి నేతలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. పౌరులు, వ్యాపారులకు అధికారుల వేధింపులు ఉండవని హావిూ ఇచ్చారు. ప్రభుత్వం నడవాలంటే నిధులు చాలా అవసరం… వ్యాపారులు సక్రమంగా పన్ను చెల్లించాలని కోరారు. దిల్లీ పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని కేజీవ్రాల్‌ తెలిపారు. అలాగే గత ఎన్నికల్లో ఆప్‌కు 8 సీట్లు తక్కువ వచ్చాయి. ఈ సారి ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. ఢిల్లీ ప్రజలు నాపై ఎంతో ప్రేమ కురిపించారు. నేను వారిపై అంతే ప్రేమను కురిపిస్తానో లేదోనన్నారు. నాకు అన్ని వర్గాల ప్రజల మద్దతు దొరికింది. ఇంత పెద్ద విజయం లభించినందుక విర్రవీగడం లేదు. కాంగ్రెస్‌కు అహంకారం వచ్చింది కాబట్టే ఓడిపోయింది. బీజేపీ గెలిచిన కొన్నాళ్లకే విర్రవీగింది. ఆ పార్టీని జనం ఓడించారు. ఐదేళ్ల పాటు ఢిల్లీ ప్రజలకు సేవచేసుకుంటానని తెలిపారు. ఇదిలావుంటే  కొత్త సీఎం కొత్త లుక్‌లో కనిపించారు.. ఢిల్లీలో వెలసిన బ్యానర్లలో కేజీవ్రాల్‌ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు మఫ్లర్‌, స్వెట్టర్‌లో కనిపించిన కేజీవ్రాల్‌ తన గేటప్‌ను మార్చేశారు. కొత్తగా షర్ట్‌ ధరించి బ్లెజర్‌ వేసుకుని దర్శనమిస్తున్నారు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. కేజీ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక ప్రమాణ కార్యక్రమంతో హస్తినలోని రామ్‌లీలా మైదానం జనసంద్రమైంది. కేజీవ్రాల్‌ అభిమానులు రామ్‌లీలా మైదానానికి భారీగా తరలివచ్చారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్‌ రేడియో ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు మైదానానికి తరలి వస్తున్నారు. అనుకున్న సంఖ్య కంటే ఎక్కువగా కేజీవ్రాల్‌ అభిమానులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తరలివస్తున్నారు. ఎటు చూసినా కేజ్రీవాల్‌ ఫోటోలే దర్శనమిచ్చాయి.  కేజీవ్రాల్‌తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వాతావరణం నెలకొంది. అలాగే  రామ్‌లీలా మైదానంలో సందడి నెలకొంది. ఆప్‌ కార్యకర్తలు, వాలంటీర్లు రామ్‌లీలా మైదానానికి భారీగా చేరుకున్నారు. రామ్‌లీలా మైదానం పరిసరాలు ఆప్‌ కార్యకర్తలతో నిండిపోయాయి. కేజ్రీవాల్‌  అభిమానులు ప్రత్యేక ఆకర్షణలో కనిపిస్తున్నారు. ఒకరైతే నెమలి

పింఛంలా తయారై మైదానానికి చేరుకున్నాడు. నెమలి పింఛంలా తయారై కేజ్రీవాల్‌ బొమ్మలను వేయించాడు.