ఢీ అంటే ఢీ అంటున్న భార‌త్‌&బంగ్లాదేశ్‌

బంగ్లాతో పోరుకు భారత్ రెడీ
 మెల్బోర్న్:  ప్రపంచ కప్ లీగ్ దశలో ఓటమెరుగని డిఫెండింగ్ చాంపియన్ భారత్.. నాకౌట్ సమరానికి సన్నద్ధమైంది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ఫేవరెట్గా బరిలో దిగుతోంది.  గురువారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఉపఖండం జట్లు భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి.  ప్రపంచ కప్లో జైత్రయాత్ర కొనసాగించాలని ధోనీసేన ఆరాటపడుతుంటే..  అంచనాలకు మించి రాణిస్తూ నాకౌట్ బెర్తు సాధించిన బంగ్లా మరో సంచలనం కోసం ఉవ్విళ్లూరుతోంది.

టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ధోనీసేన నెగ్గిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘనవిజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికాకు షాకిచ్చింది. ఆనక యూఏఈ, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వేలను ఓడించి ధోనీసేన జైత్రయాత్ర కొనసాగించింది. ఆరు మ్యాచ్ల్లో ఆరు జట్లనూ ఆలౌట్ చేసింది.  భారత బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో ఉన్నారు. జింబాబ్వేతో మ్యాచ్ లక్ష్యఛేదనలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయినా.. ధోనీ, రైనా జట్టును గెలిపించారు.   ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ జట్టుకు శుభారంభాన్ని అందిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రహానె, రైనా, ధోనీ ఫామ్లో ఉన్నారు.  ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం బ్యాట్కు చెప్పాల్సివుంది. ఇక భారత బౌలర్లూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పేసర్లు, స్పిన్నర్లు, పార్ట్ టైమర్లు సమష్టిగా రాణిస్తున్నారు. ధోనీసేన ఇదే జోరు సాగిస్తే బంగ్లాదేశ్కు ఓటమి తప్పదు.

బంగ్లా విషయానికొస్తే 6 లీగ్ మ్యాచ్ల్లో మూడింటిలో నెగ్గింది. అగ్రశ్రేణి జట్టు ఇంగ్లండ్ను ఓడించింది. గతంలో భారత్నూ ఓడించిన చరిత్ర ఉంది.  అయితే బంగ్లాకు నిలకడలేమి ప్రధాన సమస్య. ఎప్పుడెలా ఆడుతుందో చెప్పడం కష్టం. బంగ్లా బ్యాటింగ్ లైనప్లో మహ్మదుల్లా మంచి ఫామ్లో ఉన్నాడు.  ఈ ఈవెంట్లో రెండు సెంచరీలు చేశాడు. ముష్ఫికర్ రహీం, షకీబల్ హసన్ కూడా కీలకం.  బౌలింగ్ విభాగంలో సమస్యలు ఎదుర్కొంటోంది. బౌలర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు.  2007 ప్రపంచ కప్లో భారత్.. బంగ్లా చేతిలో ఓడిపోగా.. గత ప్రపంచ కప్లో భారత్.. బంగ్లాపై విజయం సాధించింది.

జట్లు (అంచనా):

భారత్: ధావన్, రోహిత్,  విరాట్ కోహ్లీ, రహానె, రైనా, ధోనీ (కెప్టెన్/కీపర్), జడేజా, అశ్విన్, మోహిత్ శర్మ, షమీ, ఉమేష్

బంగ్లాదేశ్: తమీమ్, ఇమ్రుల్ కేస్, సౌమ్యా సర్కార్, మహ్మదుల్లా, షకీబల్ హసన్, ముష్పికర్ రహీం (కీపర్), సబ్బీర్ రెహ్మాన్, అరాఫత్ సన్నీ/నాసిర్ హొస్సేన్, మోర్తజా (కెప్టెన్), రూబెల్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్.

పరుగుల పండగే: ఎంసీజీ వికెట్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశముంది. లంక, బంగ్లా మధ్య జరిగిన గ్రూపు-ఎ లీగ్ మ్యాచ్లో వాడిన పిచ్ తరహాలోనే ఉండనుంది. రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశముంది.