తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కె సి ఆర్.

-గ్రామాల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.
-తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది.
-తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్.
-కొత్త మేనిఫెస్టో పథకాల గురించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
– ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి.
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 29 జనం సాక్షి.
గద్వాల నియోజకవర్గం కేటి దొడ్డి మండల పరిధిలోని తూర్పు తాండ, గువ్వలదిన్నె తండా, పూజారి తండా, చిన్న తాండలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బలపరిచిన, గద్వాల అభ్యర్థి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని గెలిపించాలని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి అన్నారు.గ్రామంలోని సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సతీమణి కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చిన ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని ,బిజెపి, కాంగ్రెస్ పరిపాలించే ప్రాంతాలలో లేని పథకాలు ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం మన అదృష్టం అని అన్నారు.
పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలు లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుందనారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తూ ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తూ బంగారు తెలంగాణ కొరకు నిరంతరం కృషి చేస్తూన్న నాయకుడు సీఎం కెసిఆర్ అన్నారు.
నవంబర్ 30 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ని, గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి ని మరొక్కసారి ప్రతి ఒక్కరూ ఓటు వేసి, వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట రాముడు, ప్రజా ప్రతి నిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.