*తక్షణమే విఆర్ఏ ల పేస్కెల్ జీవో ను విడుదల చేయాలి..*

    *_-సింగారపు రమేష్_*
*సిపిఎం ఏరియా కార్యదర్శి*
 
**దేవరుప్పుల,జులై 30 (జనం జనం) :* మండలకేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ-జేఏసి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దేవరుప్పుల మండల విఆర్ఏ-జెఏసీ అధ్యక్షులు కెవులోతు రాజేందర్ ఆధ్వర్యంలో 6వ రోజు ‘నిరవధిక సమ్మె’లో  పాల్గొన్న విఆర్ఏ లకు ‘సిపిఎం ఏరియా కార్యదర్శి సింగారపు రమేష్’ పాల్గొని మద్దతు తెలిపారు.
అనంతరం సింగారపు రమేష్ మాట్లాడుతూ అసంబ్లీ సాక్షిగా విఆర్ఏ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్ వీరి సమస్యలపై దృష్టిపెట్టకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళయొక్క విధులను బహిష్కరించి ఈ సమ్మెలో పాల్గొంటున్నారని 55 ఏళ్ళు నిండిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అర్హత కలిగిన విఆర్ఏ లకు ప్రమోషన్లు కల్పించాలని విఆర్ఏ లకు పేస్కెల్ జీవోను తక్షణమే విడుదల చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో విఆర్ఏ-జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
Attachments area