తగ్గిన నక్సలిజం..టెర్రరిజం

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా
న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ):  దేశంలో నక్సలిజం టెర్రిరజం తగ్గుముకం పట్టాయని కేందర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నాలుగేళ్లలో గణనీయంగా కషృఇ జరిగిందని పేర్కొంది. ఈ ఏడాది మే నెల వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 119 మంది నక్సలైట్లు, 65 మంది టెర్రరిస్టులు నేలకొరిగారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. గత ఏడాది 136 మంది మావోయిస్టులు మరణించగా, ఈ ఏడాది ఐదు నెలల్లోనే 119 మంది ఎన్‌కౌంటర్‌ అయ్యారు. ఈ ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలీలోజరిగిన ఎదురుకాల్పుల్లో 40 మంది హతమయ్యారు. గత నాలుగేళ్లలో ఇస్లామిక్‌ స్టేట్‌ కు చెందిన 113 మంది టెర్రరిస్టులను ఎన్‌ కౌంటర్లలో హతమార్చినట్లు కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 65 మంది టెర్రరిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. నాలుగేళ్ల బీజేపీ విజయోత్సవంలో భాగంగా దేశంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గుముఖం పట్టాయని తేలింది. 2010- 2013 సంవత్సరాల్లో 6,524 మంది హతమవ్వగా,2014-2017 లో 4,136 మంది నక్సలైట్లు నేలకొరిగారని కేంద్రం వివరించింది. జమ్మూ కశ్మీర్‌ లో 2014లో 619 మంది టెర్రరిస్టులను మన భద్రతా దళాలు హతమార్చాయని కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ వివరించింది.