తగ్గిన పసిడి ధర

న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో పసిడి ధరలు తగ్గాయి. శనివారం బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300 తగ్గి రూ.31,600కు పడిపోయింది. నిన్న పది గ్రాములకు రూ.100 తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.40,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెళిల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో డిమాండ్‌ తగ్గింది. నిన్న వెండి ఒక్క రోజే రూ.450 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.37శాతం తగ్గి 1293.10డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.06శాతం తగ్గి 16.38డాలర్లుగా ఉంది.