తపాలా భీమా – జీవితానికి ధీమా.

బెల్లంపల్లి, అక్టోబర్ 21, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలో తపాలా భీమాకు విశేష స్పందన లభిస్తుంది. నియోజకవర్గం వ్యాప్తంగా తపాలా సిబ్బంది ప్రజలకు భీమా వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. పేద ప్రజలకు అందుబాటులో కేవలం ₹ 399 కే ₹ 10 లక్షల ప్రమాద భీమా విశేషంగా ఆకట్టుకుంటుంది. 18 – 65 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, టాటా ఏఐజి ద్వారా తపాలా శాఖ ప్రమాద భీమాకు ఆక్సిడెంట్ గార్డ్ పాలసీ పేరిట కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అతి తక్కువ వార్షిక ప్రీమియంలో అత్యధిక ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.
చికిత్స కోసం డబ్బు.
భీమా పాలసీలో పాలసీదారునికి ఖర్చుల కోసం ₹ 60 వేలు. ప్రమాదవశాత్తు గాయం అయితే చికిత్స కోసం ₹ 30 వేలు ఇస్తారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ₹ 10 పరిహారంగా లక్షలు ఇస్తారు. ఆధారపడిన ఇద్దరు పిల్లలకు చదువుల కోసం ₹ లక్ష రూపాయలు అందిస్తారు. దీనితో పాటు రవాణా ఖర్చులు కూడా అందుబాటులో ఉంటాయి.
వివరాలు ఇలా..
1. ₹ 399 ప్లాన్.
2. పోస్ట్ టాక్స్ ప్రీమియం ₹ 399.
3. పాలసీదారు మరణిస్తే ₹ 10 లక్షలు.
4. శాశ్వత వైకల్యం ₹ 10 లక్షలు.
5. పాక్షిక వైకల్యం ₹ 10 లక్షలు.
6. వైద్య ఖర్చులు ₹ 60 వేల లోపు.
7. ప్రమాదవశాత్తు వైద్య ఖర్చు ₹ 30 వేల లోపు.
8. విద్యా ప్రయోజనాలు 10 శాతం లేదా ₹ లక్ష.
9. ఆసుపత్రిలో రోజువారీ నగదు 10 రోజులకు రోజుకు ₹ వెయ్యి.
10. కుటుంబ రవాణా ప్రయోజనం ₹ 25 వేలు.